Home /News /sports /

Jarvo Arrested: టీమ్ ఇండియా నకిలీ ప్లేయర్ 'జార్వో' అరెస్ట్.. లండన్ పోలీసులు పెట్టిన కేసేంటో తెలుసా?

Jarvo Arrested: టీమ్ ఇండియా నకిలీ ప్లేయర్ 'జార్వో' అరెస్ట్.. లండన్ పోలీసులు పెట్టిన కేసేంటో తెలుసా?

జార్వో 69ను అరెస్టు చేసిన లండన్ పోలీసులు.. ఇదీ కేసు.. (PC: AP)

జార్వో 69ను అరెస్టు చేసిన లండన్ పోలీసులు.. ఇదీ కేసు.. (PC: AP)

Jarvo Arrested: పిచ్ ఇన్వేడర్ జార్వో 69ను సౌత్ లండన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొని వచ్చిన జార్వో.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోను బలంగా ఢీకొట్టాడు.

    ఇంగ్లాండ్-ఇండియా (India Vs England) మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాగా ఫేమస్ అయిన వ్యక్తి జార్వో (Jarvo 69). ఇంగ్లాండ్‌కు చెందిన ప్రాంక్‌స్టర్, నటుడు, యూట్యూబర్ అయిన డేనియల్ జర్విస్.. క్రికెట్ అభిమానులకు 'జార్వో 69' పేరుతో తెలుసు. భారత క్రికెట్ జట్టు (Team India) టెస్టు జెర్సీ ధరించి మూడు సార్లు 'పిచ్ ఇన్వేడ్' చేసిన జార్వోను లండన్ పోలీసులు (London Police) అరెస్టు చేశారు. ఓవల్ మైదానంలో (Oval Cricket Stadium) జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో జార్వో మరోసారి మైదానంలోకి ప్రవేశించాడు. బంతిని చేతితో పట్టుకొని పరుగెత్తుకుంటూ వచ్చి నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోను (Johnny Bairstow) బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత అతడిని ఓవల్ సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపివేసింది. అయితే జానీ బెయిర్‌స్టోను ఢీ కొట్టడంతో లండన్ పోలీసులు అతడిపై 'అనుమానాస్పద దాడి' కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

    రెండో రోజు తొలి సెషన్‌లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి జానీ బెయిర్‌స్టోను ఢీకొట్టాడు. అనంతరం జార్వో-బెయిర్‌స్టో మధ్య మాటల యుద్దం జరిగింది. ఇరువురూ కాసేపు వాగ్వివాదానికి దిగారు. ఇంతలోనే గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. ఈ సిరీస్‌లోనే రెండు సార్లు ఇలా మైదానంలోకి ప్రవేశించిన జార్వో రచ్చరచ్చ చేశాడు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఇండియన్ క్రికెటర్లతో కలసి మైదానంలోకి వచ్చాడు. టెస్టు జెర్సీ ధరించడంతో తొలుత ఎవరూ గుర్తించలేదు. కానీ ఆ తర్వాత మైదాన సిబ్బంది గుర్తించి అతడిని అక్కడి నుంచి బయటకు గెంటేశారు. ఇక హెడింగ్లేలో అయితే ఏకంగా బ్యాటింగ్‌కు దిగాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత ఏకంగా ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు దిగాడు. ఈ సారి ఏకంగా పిచ్ దగ్గరకు వెళ్లాడు. అతడిని అక్కడి నుంచి సిబ్బంది బలవంతంగా బయటకు తీసుకొని వచ్చారు.







    హెడింగ్లేలో చేసిన పనికి యార్క్‌షైర్ కౌంటీ అతడిపై జీవిత కాలం నిషేధం విధించింది. ఇక ఇప్పుడు ఓవల్ సిబ్బంది మాత్రం అతడిపై మామూలు చర్యలు తీసుకోవడానికి నిరాకరించింది. ఏకంగా లండన్ పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు వచ్చే వరకు సిబ్బంది అతడిని స్టేడియంలోనే బంధించారు. ఆ తర్వాత ఆటగాళ్లపై దాడి చేశారని చెబుతూ లండన్ పోలీసులకు అప్పగించారు. కియా ఓవల్ సిబ్బంది పిర్యాదు మేరకు జార్వోపై లండన్ పోలీసులు అనుమానాస్పద దాడి కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 'ఒక వ్యక్తిని మేము ఓవల్ క్రికెట్ గ్రౌండ్ వద్ద శుక్రవారం అరెస్టు చేశాము. ప్రస్తుతం అతడు సౌత్ లండన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు' అని మెట్రొపాలిటన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. జార్వో 69 కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిస్ట్రబ్ అయ్యిందని ఓలీ పోప్ మ్యాచ్ అనంతరం పేర్కొనడం గమనార్హం.

    Football Players Salaries: క్లబ్ జీతాల్లో 7వ స్థానానికి పడిపోయిన రొనాల్డో.. అతడి కంటే ఎక్కువ సంపాదిస్తున్న జూనియర్లు

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Arrested, India vs england

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు