Home /News /sports /

PITCH INVADER FORCIBLY GRABS LIONEL MESSI FOR TAKING SELFIE AND NEXT THIS HAPPENED WATCH SRD

Viral Video : బాబోయ్ నీ అభిమానం తగలెయ్య.. కాస్త ఉంటే మెస్సీ ప్రాణాలు పోయేవి కదరా అయ్యా..!

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : వారి దృష్టిలో పడాలనీ, మాట కలపాలనీ, సెల్ఫీ దిగాలనీ ఉవ్విళ్లూరతారు. దీని కోసం ఎంతకైనా తెగిస్తారు. ప్రతి మనిషికీ రెండు జీవితాలుంటాయి.. వ్యక్తిగతం, వృత్తిగతం. తారలకైనా అంతే.

    అభిమానిస్తే తప్పులేదు.. అది హద్దులు దాటినప్పుడే వస్తుంది చిక్కంతా. సినిమా నటులు, క్రీడాకారులు, గాయకులు, రాజకీయ నాయకులకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఎక్కువ. అందులో నూటికి తొంభైశాతం యువతే. వయసు పెరుగుతున్నకొద్దీ అభిమానం ముదిరి.. వెర్రి తలలు వేయడం మనం చూస్తూనే ఉంటాం. సెలబ్రిటీలు మా సొంతమని భావిస్తారు. వారి దృష్టిలో పడాలనీ, మాట కలపాలనీ, సెల్ఫీ దిగాలనీ ఉవ్విళ్లూరతారు. దీని కోసం ఎంతకైనా తెగిస్తారు. ప్రతి మనిషికీ రెండు జీవితాలుంటాయి.. వ్యక్తిగతం, వృత్తిగతం. తారలకైనా అంతే. అభిమానులు వారి వ్యక్తిగత జీవితాలను రిస్క్ లో పడేయాలనుకూడదు. ఈ సుత్తి అంతా ఎందుకు చెబుతారనుకుంటున్నారా..? అయితే, ఈ స్టోరీ మీరు చదవాల్సిందే. అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ (Lionel Messi)కి ఒక అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. ఎంతలా అంటే చావు తప్పిందే అనుకోవాలి. ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఈక్వెడార్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత మెస్సీ అభిమాని ఒకరు ''మెస్సీ.. మెస్సీ'' అని గట్టిగా అరుస్తూ గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చాడు. ఇది గమనించకుండా వెళ్తున్న మెస్సీకి అడ్డుగా వెళ్లి.. అతని భుజంపై చేయి వేసి ఒక్క సెల్ఫీ అంటూ అడిగాడు. అయితే పొరపాటు ఆ అభిమాని తన చెయ్యిని మెస్సీ మెడకు చుట్టేయడంతో ఊపిరి ఆడడం కష్టంగా మారింది. ఇంకా, నయం మెస్సీ వెంటనే స్పందించి తేరుకున్నాడు. లేకపోతే.. అసలకే ప్రమాదం వచ్చి ఉండేది.








    View this post on Instagram






    A post shared by @jossuegarzon





    అభిమాని చేసిన చర్యతో మెస్సీ బిత్తరపోయాడు. కోపంతో.. ''బాస్‌ నేను మనిషినే.. ఇబ్బంది పెట్టకు'' అంటూ అతన్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యురిటీ వచ్చి అతన్ని స్టేడియం నుంచి బయటకు పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి అభిమానం ఉండకూడదు బాస్ అంటూ అతని సలహాలిస్తున్నారు.

    ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ చూడలా .. వైరలవుతున్న లక్నో వెరైటీ సెలబ్రేషన్స్..

    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈక్వెడార్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. కాగా అర్జెంటీనాకు క్వాలిఫయింగ్‌లో ఇదే చివరి మ్యాచ్‌. ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా 11 మ్యాచ్‌లు గెలిచి.. ఆరు డ్రా చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. కాగా అర్జెంటీనాతో పాటు బ్రెజిల్‌, ఉరుగ్వే, ఈక్వెడార్‌లు ఫిఫా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Foot ball, Lionel Messi, Sports, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు