PISTOL TECHNICAL GLITCH FOR SHOOTER MANU BHAKAR FAILED TO REACH FINAL ROUND IN TOKYO OLYMPICS JNK
Tokyo Olympics: తుపాకీలో సాంకేతిక లోపం.. సమయం వృధా.. ఫైనల్‌కు చేరని మను బాకర్
మను బాకర్ తుపాకీలో సాంకేతిక లోపం (Twitter)
భారత షూటర్ల బృందానికి టోక్యో ఒలింపిక్స్లోనిరాశ ఎదురైంది. స్టార్ షూటర్ మను బాకర్ తుపాకీలో సాంకేతిక లోపం ఏర్పడటంతో సమయం వృధా చేసుకొని ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేక పోయింది.
భారత షూటర్ల(Indian Shooters) బృందం టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics 2020) నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్‌తో (Manu Bhakar) పాటు యశస్విని సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. మను బాకర్ పిస్టల్‌కు చెందిన ఎలక్ట్రానికి ట్రిగ్గర్‌లో సాంకేతిక లోపం (Technical glitch) ఎదురైంది. ఎయిర్ పిస్టర్ 10 మీటర్ల ఈవెంట్లో గంట 15 నిమిషాల వ్యవధిలో 60 షాట్లు కాల్చాల్సి ఉంటుంది. అయితే 16 షాట్లు పూర్తయ్యాక ట్రిగ్గర్‌లో లోపం వచ్చింది. నిబంధనల ప్రకారం అక్కడికక్కడే లోపాన్ని సరిచేసుకోవడానికి వీలుండదు. దీంతో పోటీ స్థలంనుంచి దూరంగా వెళ్లి పిస్టల్ సరి చేసుకొని తిరిగి వచ్చే సరికి దాదాపు 20 నిమిషాల సమయం వృధా అయ్యింది. . తొలి 20 నిమిషాల్లో కేవలం 16 షాట్లు మాత్రమే పూర్తి చేసింది. మిగిలిన 44 షాట్లను కొట్టడానికి 55 నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. దీంతో ఒత్తిడికి గురైన మను బాకర్ చివర్లో సరైన గురి పెట్టలేకపోయింది. త్వరత్వరగా షాట్లు కొట్టడానికి ప్రయత్నించి పాయింట్లు పోగొట్టుకున్నది. ఐదో సిరీస్‌లో 98 పాయింట్ల కనుక సాధించి ఉంటే ఫైనల్ రౌండ్‌కు చేరుకునేది. కానీ కేవలం 95 పాయింట్లు మాత్రమే సాధించి 3 పాయింట్ల తేడాతో ఫైనల్ బెర్త్ కోల్పోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో తప్పక పతకం సాధిస్తుందని మను బాకర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ పిస్టల్ రూపంలో ఆమెకు దురదృష్టం వెన్నాడింది.
మను బాకర్ ఫైనల్ చేరకపోవడంతో ఫ్రాన్స్ షూటర్ గోబర్ విల్లి ఎనిమిదో స్థానంలో నిలిచి చివరి బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విబాగంలో రష్యాకు చెందిన క్రీడాకారిణి బత్సరస్కినా స్వర్ణం, బల్గేరియాకు చెందిన కొస్తదినోవా రజతం, చైనాకు చెందిన జియాంగ్ రాన్‌జిన్ కాంస్య పతకం నెగ్గారు. మరోవైపు భారత పురుష షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత రౌండ్లో దీపక్ కుమార్, దివ్యాంశ్ పేలవ ప్రదర్శనలతో వరుసగా 26, 32వ స్థానాల్లో నిలిచారు. దీపక్ 624.7 పాయింట్లు, దివ్యాంశ్ 622.8 పాయింట్లు సాధించాడు. స్కీట్ క్వాలిఫయింగ్‌లో అంగద్ వీర్ సింగ్ మూడు రౌండ్లు ముగిసే సరికి 11వ స్థానంలో నిలిచాడు. మిగిలిన రెండు రౌండ్లు సోమవారం నిర్వహించనున్నారు.
Manu Baker's pistol's cocking lever broke down compelling her to take shots in 36 minutes an improbable task in any level of competition. Tragic exit. pic.twitter.com/ZejVSrF9FF
భారత షూటింగ్ జట్టు తప్పక ఒలింపిక్ పతకాలు సాధిస్తుందని అందరూ బావించారు. ముఖ్యంగా మనూ బాకర్ మంచి ఫామ్‌లో కూడా ఉన్నది. కానీ చివరకు పిస్టల్‌లోని సాంకేతిక లోపం ఆమెను పతకానికి దూరం చేసింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.