news18-telugu
Updated: December 1, 2020, 2:13 PM IST
anushka and kohli
మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అనుష్క ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతిగా ఉన్నప్పటికీ అనుష్క వ్యాయామం, యోగాను ఆపలేదు. కఠినమైన శీర్షాసనం కూడా వేసింది. దీనికి భర్త కోహ్లీ సాయం తీసుకుంది.
మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అనుష్క ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతిగా ఉన్నప్పటికీ అనుష్క వ్యాయామం, యోగాను ఆపలేదు. దీనికి భర్త కోహ్లీ సాయం తీసుకుంది. కఠినమైన శీర్షాసనం కూడా వేసింది. యోగా తన జీవితంలో భాగమని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆసనాలు వేయడం సంతోషంగా ఉందన్నారు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. అయితే వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
భర్త కోహ్లి సాయంతో శీర్షాసనం వేసిన పాత ఫొటోను ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఆమె.. ‘‘అన్నింటికంటే ఇది అత్యంత కఠినమైన వ్యాయామం. యోగాకు నా జీవితంలో ముఖ్యస్థానం ఉంది. ఈసారి గోడతో పాటు నాకెల్లప్పుడూ అండగా ఉండే భర్త సాయం తీసుకున్నా. తను నన్ను బ్యాలెన్స్ చేయడంతో పాటుగా మరింత సురక్షితంగా ఉండేలా చేశాడు. గర్భం దాల్చిన తర్వాత కూడా యోగా ప్రాక్టీసు చేయగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. అయితే, కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. మూడు వన్డేలు, టీ20లు, తొలి టెస్టు ముగిసిన తర్వాత పితృత్వ సెలవుపై అతడు భారత్కు తిరిగిరానున్నాడు. ప్రసవ సమయంలో అనుష్క దగ్గర ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు కోహ్లీ.
Published by:
Rekulapally Saichand
First published:
December 1, 2020, 2:12 PM IST