టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) పేరు ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌లో ఉంది. మొన్న న్యూజిలాండ్‌తో ఆడిన ఫస్ట్ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ఈ బ్యాటర్ గురించి డేటింగ్ అఫైర్స్ ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. అతడు ఇప్పుడు పంజాబీ హీరోయిన్ సోనమ్ బజ్వాతో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సోనమ్ తాజాగా స్పందించింది. ఈ వార్తలపై ఆమె ఇచ్చిన రిప్లై.. గిల్ సారాతో రిలేషన్‌లో ఉన్నట్లు హింట్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. శుభ్‌మన్ గిల్ మొన్న చేసిన డబుల్ సెంచరీకి బూస్టింగ్ ఇచ్చింది అతడి కొత్త గర్ల్‌ఫ్రెండ్ అన్నట్లు ఒక మీమ్ ట్విట్టర్‌లో ప్రత్యక్షమైంది. పాపులర్ మీమ్ పేజ్ ‘గ్జేవియర్ అంకుల్’, ఈ విషయంపై ఒక మీమ్ వేసింది. అందులో సోనమ్, గిల్ షేక్‌హ్యాండ్స్ చేసుకున్న ఫోటో, డబుల్ సెంచరీకి రీజన్ ఇదే అనే క్యాప్షన్ ఉన్నాయి. అయితే.. ఆ ఫోటోపై గిల్ డబుల్ సెంచరీ తర్వాత మీమ్స్ చేశారు. దీనిపై ఈ హీరోయిన్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
* రిప్లై ఇదే
గ్జేవియర్ అంకుల్ మీమ్ పోస్టును రీట్వీట్ చేసిన సోనమ్.. ‘Ye sara ka sara jhoot hai’ అని రాసింది. దీనికి.. ‘ఇదంతా పచ్చి అబద్ధం’ అనే అర్థం వస్తుంది. అంటే తాను గిల్‌తో డేటింగ్‌లో లేను అని చెబుతూనే.. అతడు సారాతో రిలేషన్‌లో ఉన్నాడని అర్థం వచ్చేలా సోనమ్ పోస్టు పెట్టింది. రెండుసార్లు సారా పేరు మెన్షన్ చేస్తూ ఫన్నీ రిప్లై ఇచ్చింది.
reason behind gill's back to back hundreds pic.twitter.com/KSbzstEuXy
— Xavier Uncle (@xavierunclelite) January 18, 2023
* ఫోటో ఎప్పటిది?
పంజాబ్ నుంచి వచ్చిన శుభ్‌మన్, గత ఏడాది సోనమ్ నిర్వహించిన ఒక టీవీ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశాడు. అప్పుడు ఇద్దరూ షేక్‌హ్యాండ్ తీసుకున్న ఫోటోనే ఇప్పుడు మీమర్స్ వాడుకున్నారు. అయితే ఆ ఎపిసోడ్‌లో బజ్వా, గిల్.. సారా అలీ ఖాన్ గురించి రెండుసార్లు మాట్లాడుకున్నారు.
Ye sara ka sara jhoot hai ???? https://t.co/XNgLbQYPSq
— Sonam Bajwa (@bajwasonam) January 19, 2023
* ఆ ‘సారా’ ఎవరు?
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకేరకమైన పోస్టులు పెట్టడంతో అందరూ అది నిజమనుకున్నారు. కానీ ఆ తర్వాత గిల్, బాలీవుడ్ యాక్ట్రెస్ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపించాయి. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటోలు, ఎయిర్‌పోర్ట్‌లో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ గిల్, సారా మాత్రం తమ రిలేషన్‌షిప్ గురించి మాట్లాడలేదు.
అయితే సోనమ్ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. ‘శుభవార్త చెప్పు శుభ్‌మన్’ అని ఒక వ్యక్తి కామెంట్ రాశాడు. డబుల్ సెంచరీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఇద్దరు సారాలకు ఒక్కో వంద అంకితం చేశాడు’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Cricket, Sara Ali Khan, Team India