HOME »NEWS »SPORTS »pcb has confirmed 3 players haider ali haris rauf shadab khan have tested positive for covid19 sk

ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా.. ఇంగ్లండ్ టూర్‌కు ముందు షాక్

ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా.. ఇంగ్లండ్ టూర్‌కు ముందు షాక్
ప్రతీకాత్మక చిత్రం

త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్లకు రావల్పిండిలో కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది.

  • Share this:
    పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి తీవ్ర కలకలం రేపింది. ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారినపడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. హైదర్ అలీ, హారిస్ రౌఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. ఐతే వీరి ముగ్గురిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్లకు రావల్పిండిలో కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పీసీబీ అధికారులు వారితో సన్నిహితంగా మెలిగిన వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాపిద్ అఫ్రిది ఇప్పటికే కరోనా బారినపడిన విషయం తెలిసిందే.




    కాగా, పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 181,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 71,458 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 3,590 మంది మరణించారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 106,040 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
    First published:June 22, 2020, 22:51 IST