PBKS vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. స్టార్ బ్యాట్స్‌మెన్ ప్లేసులో యువ క్రికెటర్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ (PC: IPL)

PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

 • Share this:
  ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings) - రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెల్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ స్టేడియం వికెట్‌పై గడ్డి ఎక్కువగా ఉండి సాయంత్రం సమయంలో విపరీతంగా మంచు కురుస్తున్నది. అంతే కాకుండా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాపార్డర్ కుప్పకూలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక స్టార్ బ్యాట్స్‌మాన్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ క్రికెటర్ ఇషాన్ పోరెల్ అరంగేట్రం చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్న పొరెల్ తొలిసారిగా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

  టాస్ ఓడినా ఇక్కడ మంచి స్కోర్ సాధించి టార్గెట్ సెట్ చేస్తామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) అన్నాడు. టార్గెట్ ఫిక్స్ చేయడంలో అయినా.. ఛేదించడంలో అయినా మేము ఎప్పుడూ సిద్దంగానే ఉంటాము. మా జట్టులో మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్లు ఉన్నారు. కోచ్ సంగక్కర మాకు మంచి దిశానిర్దేశనం చేస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిచి మా ప్లేఆఫ్ అవకాశాలను మెరుగు పరుచుకుంటామని శాంసన్ చెప్పుకొచ్చాడు.

  Mithali Raj: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. మహిళా క్రికెట్‌లో మిథాలీ రికార్డుల మోత  ఇరు జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లలో తలపడగా.. పంజాబ్ జట్టు 12 సార్లు, రాజస్థాన్ జట్టు 10 సార్లు విజయం సాధించింది.
  Published by:John Naveen Kora
  First published: