• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • PBKS VS DC DELHI WON THE TOSS AND ELECTED TO BOWL DAVID MALAN TO DEBUT IN IPL JNK

IPL 2021: PBKS vs DC టాస్ గెల్చి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంజాబ్ జట్టలో నెంబర్ వన్ బ్యాట్స్‌మాన్

టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

  • Share this:
    ఐపీఎల్ 2021‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్(Toss) గెల్చి బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. కోల్‌కతాపై ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. ఈ సీజన్‌లో అంచనాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నది. టాపార్డర్‌లో ధావన్, పృథ్వీషా, పంత్ ఫామ్‌లో ఉన్నారు. హెట్‌మెయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. ఇక ఈ సీజన్‌లో అద్భుతమైన బౌలింగ్ కలిగిన జట్లతో ఢిల్లీ ఒకటి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.

    మరోవైపు బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి పంజాబ్ కింగ్స్ ఆత్మవిశ్వాసంతో కనపడుతున్నది. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ సీజన్‌లో మయాంక్ బ్యాటుతో సరిగా ప్రభావం చూపలేదు. బెంగళూరు మ్యాచ్‌లో బ్యాటింగ్ , బౌలింగ్‌లో రాణించింది. రిలే మెరిడిత్, రవి బిష్ణోయ్, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో కీలకంగా మారనున్నది. వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ తరపున అరంగేట్రం చేస్తున్నాడు.





    తుది జట్లు

    Delhi Capitals XI: P Shaw, S Dhawan, S Smith, R Pant, M Stoinis, S Hetmyer, A Patel, L Yadav, K Rabada, I Sharma, A Khan

    Punjab Kings XI: M Agarwal, P Singh, C Gayle, D Malan, D Hooda, S Khan, H Brar, C Jordan, R Meredith, R Bishnoi, M Shami
    Published by:John Naveen Kora
    First published: