మూడుసార్లు ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) ఛాంపియన్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్ (Patna Pirates) 8వ సీజన్‌లో విజయంతో శుభారంభం చేసింది. లీగ్‌లోని తన తొలి మ్యాచ్‌లో గురువారం 42-39తో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది. మ్యాచ్ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది, ఇందులో హర్యానా మొదటి అర్ధభాగంలో 4 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించింది. కానీ రెండవ సగంలో పాట్నా అద్భుతంగా ఆడింది. పాట్నా తరఫున రైడర్ మోను గోయత్ 15 పాయింట్లు సాధించాడు. హర్యానా తరఫున ఆల్ రౌండర్ రోహిత్ గులియా 10 పాయింట్లు సాధించాడు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని షెరటన్ గ్రాండ్‌లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాట్నా జట్టు మొదట్లో వెనుకబడింది. ఈ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ విజయాన్ని నమోదు చేస్తుందని అనిపించింది. అయితే రైడర్ ప్రశాంత్ కుమార్ కెప్టెన్సీలో ఉన్న పాట్నా జట్టు బలంగా పునరాగమనం చేసింది. పాట్నా పైరేట్స్‌కు మోను గోయత్‌తో పాటు ప్రశాంత్ కుమార్, సచిన్ చెరి 7 పాయింట్లు జోడించారు. అదే సమయంలో హర్యానా తరఫున రోహిత్‌తో పాటు కెప్టెన్ వికాస్ ఖండోలా 6 పాయింట్లు సాధించాడు.
మ్యాచ్ తొలి అర్ధభాగంలో హర్యానా స్టీలర్స్ 22 పాయింట్లు జోడించగా, పాట్నా 18 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగంలో హర్యానా రైడ్‌ల ద్వారా 13 పాయింట్లు, ట్యాకిల్స్‌తో 7 మరియు ఆల్ అవుట్‌ల నుండి 2 పాయింట్లు సాధించగా.. పాట్నా రైడ్‌ల ద్వారా 13 పాయింట్లు, ట్యాకిల్స్ ద్వారా 2 పాయింట్లు మరియు 2 అదనపు పాయింట్లను మాత్రమే జోడించింది. రెండో అర్ధభాగంలో పాట్నా 24 పాయింట్లు జోడించగా, హర్యానా జట్టు 17 పాయింట్లు మాత్రమే పొందగలిగింది. చివరి అర్ధభాగంలో పాట్నా రైడ్‌ల ద్వారా 15 పాయింట్లు మరియు ట్యాకిల్స్‌తో 7 పాయింట్లు జోడించగా, హర్యానా రైడ్‌లతో 10 పాయింట్లు మరియు ట్యాకిల్స్‌తో 7 పాయింట్లు సాధించింది.
Team India: సచిన్ టెండుల్కర్ నుంచి బుమ్రా వరకు.. ఈ క్రికెటర్ల భార్యలు వయసు పరంగా పెద్దవాళ్లు..
.@DabangDelhiKC and @GujaratGiants' #vivoProKabaddi Season 8 campaign started with some 💥 moves!
Here's the updated points table after each team have had a chance to feature in a #SuperhitPanga 💪🏻#GGvJPP #DELvPUN #HSvPAT pic.twitter.com/7iA6p5fP4Z
— ProKabaddi (@ProKabaddi) December 23, 2021
అంతకు ముందు పింక్ పాంథర్స్ జట్టుపై గుజరాత్ జెయింట్స్ 34-27 తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టులో రైడర్ రాకేశ్ నర్వాల్, డిఫెండర్ గిరీష్ మారుతీ చెరి ఏడు పాయింట్లు సాధించగా.. ఆల్ రౌండర్ రాకేష్ 6 పాయింట్లు రాబట్టాడు. అదే సమయంలో జైపూర్ తరఫున రైడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఇక మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ను ఓడించింది. దబాంగ్ ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ అత్యధికంగా 16 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ విజయ్ కూడా 9 పాయింట్లతో అతడికి అండగా నిలిచాడు. తొలి అర్దభాగంలో ఢిల్లీ 7 పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. రెండో అర్దభాగంలో పుణేరి పల్టన్ పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఢిల్లీ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ 41-30 తేడాతో విజయం సాధించింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pro Kabaddi League