• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • PAT CUMMINS DITCHED PM CARES NO HE ALLOCATED HIS DONATION TO UNICEF AUSTRALIA INDIA COVID CRISIS CAMPAIGN JNK

IPL 2021 : ఝలక్ ఇచ్చిన పాట్ కమిన్స్.. కోవిడ్ విరాళంపై యూ టర్న్.. వారంలోనే డెషిషన్ ఛేంజ్

IPL 2021 : ఝలక్ ఇచ్చిన పాట్ కమిన్స్.. కోవిడ్ విరాళంపై యూ టర్న్.. వారంలోనే డెషిషన్ ఛేంజ్

కరోనా విరాళం విషయంలో నిర్ణయం మార్చుకున్న పాట్ కమిన్స్ [PC: iplt20.com]

ఇండియాలో కోవిడ్-19 రోగులకు ఆసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్ దొరకడం లేదు. ఆక్సిజన్ నిల్వలు అడగంటటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అనేక మంది ఇందు కోసం విరాళాలు పంపిస్తున్నారు. పాట్ కమిన్స్ కూడా ఆక్సిజన్ కొనుగోలుకు 50 వేల డాలర్లు పీఎం కేర్స్‌కు అందించనున్నట్లు తెలిపాడు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే...

  • Share this:
    ఐపీఎల్‌లో (IPL 2021) కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) తరపున ఆడుతున్న ఆస్ట్రేలియన్ పేసర్ పాట్ కమిన్స్ (Pat Cummins) గత సోమవారం 50 వేల డాలర్ల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో పెరిగిపోతున్న కరోనా (Covid-19) కేసుల కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి తగినంత ఆక్సిజన్ దొరకడం లేదు. దీంతో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కొనుగోలు, ఆక్సిజన్ దిగుమతికి తన వంతుగా 50 వేల డాలర్ల సహాయాన్ని భారత ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. 'పీఎం కేర్స్' ఫండ్‌కు తన విరాళాన్ని అందిస్తానని కూడా మాట ఇచ్చాడు. కానీ వారంలోనే తన విరాళంపై యూ టర్న్ తీసుకున్నాడు. తాను ఇవ్వాలనుకున్న 50 వేల డాలర్లను 'పీఎం కేర్స్'కు కాకుండా యూనిసెఫ్‌కు అందించనున్నట్లు తెలిపాడు. యూనిసెఫ్ ఆస్ట్రేలియా శాఖ ఇండియాలో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి విరాళాల సేకరణ మొదలు పెట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా భారత దేశానికి సహాయం చేయాలని భావించింది. ఇందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్, యూనిసెఫ్ ఆస్ట్రేలియా కలసి ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించాయి. 'ఇండియాలో సెకెండ్ వేవ్ కారణంగా జరుగుతున్న నష్టం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా చాలా విచారం వ్యక్తం చేస్తున్నది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఒక బలమైన స్నేహబంధం ఉన్నది. అందుకే యూనిసెఫ్‌తో కలపి నిధుల సేకరణ ప్రారంభించాము. ఇండియాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, కరోనా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడానికి, కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కోసం ఈ నిధులను ఉపయోగిస్తాము. ఇందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగా 50 వేల డాలర్లను విరాళంగా ఇస్తున్నది. ప్రతీ ఆస్ట్రేలియా పౌరుడు కూడా ఈ క్యాంపెయిన్‌లో పాల్గొని ఇండియాకు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాము' అని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన చేసింది.

    పాట్ కమిన్స్ ఈ ప్రకటనను ట్విట్టర్‌లో రీట్వీట్ చేసి తన విరాళాన్ని పీఎం కేర్స్‌కు కాకుండా యూనిసెఫ్ ఆస్ట్రేలియా ఇండియా కొవిడ్ క్రైసిస్‌కు అందించనున్నట్లు పేర్కొన్నాడు. 'క్రికెట్ ఆస్ట్రేలియా మంచి పని చేస్తున్నది. నా విరాళాన్ని ఈ క్యాంపెయిన్‌కు కేటాయిస్తున్నట్లు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం అవ్వండి' అని కమిన్స్ ఆ ట్వీట్‌లో తెలియజేశాడు.





    ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. కేకేఆర్ జట్టులోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు కరోనా సోకడంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. మిగతా జట్టు అంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. సోమవారం జరగాల్సిన బెంగళూరు-కోల్‌కతా మ్యాచ్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు