HOME »NEWS »SPORTS »parthiv patel satire on rcb honour to be released after retirement sa

IPL 2020: ఆర్సీబీపై పార్థివ్‌ పటేల్‌ సెటైర్.. ఇంతకి ఏమాన్నాడో తెలుసా!

IPL 2020: ఆర్సీబీపై  పార్థివ్‌ పటేల్‌ సెటైర్.. ఇంతకి ఏమాన్నాడో తెలుసా!
parthiv-patel

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కూడా తన జట్టు పలువురు ఆటగాళ్ళను రిలీజ్ చెసింది. ఆ లిస్ట్‌లో  ఆర్సీబీ మాజీ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ పేరును కూడా చేర్చింది. అయితే దీనిపై పార్థివ్‌ సరదాగా స్పందించాడు. "

  • Share this:
    టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) నిర్ణయంపై సరదాగా స్పందించారు.
    ఐపీఎల్‌ 2021 మీని వేలం సందర్భంగా వివిధ ఫ్రాంచైజీలు అవసరం లేని ఆటగాళ్ల జాబితాను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కూడా తన జట్టు పలువురు ఆటగాళ్ళను రిలీజ్ చెసింది. ఆ లిస్ట్‌లో  ఆర్సీబీ మాజీ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ పేరును కూడా చేర్చింది. అయితే దీనిపై పార్థివ్‌ సరదాగా స్పందించాడు. "టీంను వదిలేయడం కాస్తంత బాధగా ఉంది. రిటైర్‌ అయ్యాక ఆర్సీబీ ఈ విధంగా సత్కరించింది తీరు బాగుంది" అంటూ సరదాగా ట్వి్ట్ చేశాడు. ఇక పార్థివ్‌పటేల్‌ గత డిసెంబర్‌లోనే అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.







    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, షెబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే



    బెంగళూరు వదులుకున్న ఆటగాళ్లు : మోయిన్ అలీ, శివమ్ దూబే, గుర్‌క్రీత్ సింగ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థీవ్ పటేల్(రిటైర్డ్), డేల్ స్టేయిన్, ఇసురు ఉడానా, ఉమేశ్ యాదవ్
    Published by:Rekulapally Saichand
    First published:January 22, 2021, 06:55 IST

    टॉप स्टोरीज