నా కెరీర్‌ ఆగిపోడానికి ఆయన కారణం కాదు:పార్థివ్‌


Updated: June 29, 2020, 4:48 PM IST
నా కెరీర్‌ ఆగిపోడానికి ఆయన కారణం కాదు:పార్థివ్‌
మాలిక్ ట్వీట్ చేసిన ఫొటో
  • Share this:
మహేంద్రసింగ్‌ ధోనీ వల్ల తన కెరీర్‌‌ ఆగిపోయిందనే విమర్శలను తప్పుబట్టారు వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌. ధోనీ అనుహ్య ఎంట్రీతో పార్థివ్‌జట్టు నుంచి దూరం కావాల్సి వచ్చిందని కొందరు క్రికెట్ అభిమానులు చేస్తున్న ఆరోపణలను ఖడించారు పార్థివ్. ఆదివారం ఆకాశ్‌చోప్రాతో యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన పార్థివ్ ఈవిషయంపై స్పందించాడు.

"మహేంద్రసింగ్‌ ధోనీ రాకతో నా కేరీర్ మధ్యలోనే అగిపోయిందని చాలా మంది అన్నారు. అది అసత్య ప్రచారం మాత్రమే. చాలా సార్లు ఈ విషయంపై వివరణ ఇచ్చాను. అతను రాకతో నా కెరీర్‌కు తెరపడిందనే సానుభూతిని నేను ఆశించను. నేను జట్టులో పూర్తి కాలం కొనసాగకపోవడానికి కారణం మంచి ప్రదర్శన చేయకపోవడంమేనని అనుకుంటా. నా ఆటతీరు బాగా ఉండి ఉంటే టీం నుంచి బయటకు వెళ్ళే వాన్ని కాదు. కేవలం ధోనీ వల్లే నా కెరీర్ ముగిసిందనే జాలి నాకు నచ్చదు. ఏ స్థాయిలో ఆడినా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్న. అందుకే అండర్‌-16 ఆటగాళ్లతో కూడా ఆడానని" వివరించాడు.
First published: June 29, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading