హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics: పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవనీ లేఖరా

Paralympics: పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవనీ లేఖరా

అవని లేఖరా (image credit - twitter)

అవని లేఖరా (image credit - twitter)

Paralympics: పారా ఒలింపిక్స్‌లో భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇండియాలో సరికొత్త స్పోర్ట్స్ విప్లవానికి తెర తీస్తున్నారు.

Paralympics: టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్.. మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) విభాగంలో భారత్ నుంచి ఇండియన్ షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి భారత్‌కు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. ఈ ఫైనల్‌లో అవనీ లేఖరా... 249.6 రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించగా... చైనాకు చెందిన కుయ్‌పింగ్ ఝాంగ్ (Cuiping Zhang) 248.9తో రజత పతకాన్ని గెలుచుకోగా.... ఉక్రెయిన్‌కి చెందిన ఇరినా షెత్నిక్ (Iryna Shchetnik)... 227.5తో కాంస్య పతకం గెలుచుకున్నారు.

పారాఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా రికార్డ్ సృష్టించింది.

అవనీ లేఖర గోల్డ్ మెడల్ సాధించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. పారాఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారు.

అవనీ లేఖర సాధించిన ఈ అద్భుత విజయంతో యావత్ భారత దేశం గర్విస్తోంది.

అవనీ లేఖరా విజయంపై ఇండియా పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. యంగ్ షూటర్ సైలెంటుగా ఉండి... ప్రపంచ రికార్డ్ సృష్టించిందని మెచ్చుకున్నారు.

మరోవైపు డిస్కస్ త్రో F56లో ఇండియాకి చెందిన యోగేష్ కథునియా (Yogesh Kathuniya) రజత (Silver) మెడల్ గెలుచుకోవడంతో... హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి.

యోగేష్ కథునియా డిస్కస్ త్రోని విసురుతున్న సందర్భాన్ని హర్యానా... బహదూర్‌ఘర్‌లోని కుటుంబ సభ్యులు టీవీలో చూసి సంబరాల్లో మునిగిపోయారు. ఒక్కసారిగా అక్కడ పండగ వాతావరణం వెల్లివిరిసింది.

క్లాస్ F56లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న తర్వాత యోగేష్ కథునియా భావోద్వేగం చెందాడు. నేను ఇది సాధించడం గొప్పగా ఉంది. సాయ్ (SAI), ఇండియా పారా ఒలింపిక్ కమిటీ (PCI), ముఖ్యంగా నాకు సపోర్టుగా నిలిచిన నా తల్లికి థాంక్స్ చెబుతున్నాను అని యోగేష్ తెలిపాడు.

ఇది కూడా చదవండి: Afghanistan: భారత్ పట్ల తాలిబన్ల వైఖరేంటి? CNN న్యూస్18తో ప్రత్యేక ఇంటర్వ్యూ

మరోవైపు టోక్యో పారా ఒలింపిక్స్‌... జావెలిన్ త్రో F45 విభాగంలో విభాగంలో... దేవేంద్ర ఝఝారియా సిల్వర్ మెడల్ గెలుచుకోగా... సుందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నారు.

ఇలా పారా ఒలింపిక్స్‌లో మన వాళ్లు సాధిస్తున్న విజయాలపై భారతీయులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

First published:

Tags: Tokyo Olympics

ఉత్తమ కథలు