Paralympics: పారాలింపిక్స్‌లో ప్రేమాయణం.. అథ్లెట్‌కు ప్రపోజ్ చేసిన కోచ్.. ఆ తర్వాత ఏం జరిగింది?

పారాలింపిక్స్ ట్రాక్ పైనే అథ్లెట్‌కు ప్రపోజ్ చేసిన కోచ్ (PC: Paralympics)

ట్యోకో పారాలింపిక్స్‌లో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకున్నది. ఫైనల్స్‌కు క్వాలిఫై కాని బాధలో ఉన్న స్ప్రింటర్‌కు కోచ్ పెళ్లి ప్రతిపాదన చేశాడు. అతడి ప్రపోజల్‌కు ఆమె కూడా ఒప్పుకోవడంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది.

  • Share this:
    టోక్యో (Tokyo) వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో (Paralympics 2020) ఎంతో మంది వైకల్యం ఉన్న అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తమ దేశం తరపున పాల్గొని పతకాలు కొల్లగొడుతున్నారు. దాదాపు 140 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. అలా తన దేశం తరపున కూడా పతకం గెలవాలనే ఆకాంక్షతో కేయులా నిద్రియా పెరీరా పారాలింపిక్స్‌కు వచ్చింది. చూపు లేని ఈ స్ప్రింటర్ 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నది. అయితే సెమీఫైనల్స్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆమె ఓడిపోయింది. అయితే ఆ పోటీల్లో ఓడిపోయి పతకం సాధించలేక పోయినా బాధపడాల్సిన పనే లేకుండా పోయింది. ఎందుకంటే ఓడిపోయిన వెంటనే ఆమెకు అంతకు మించిన ఆశ్చర్యం జరిగింది. నాలుగో రౌండ్‌లో ఓడిపోయిన వెంటనే పెరీరా వద్దకు ఆమె కోచ్ మాన్యువల్ ఆంటోనియో వాజ్‌డావే వచ్చాడు. ఓడిన ఆమెను ఓదార్చుతాడని అందరూ అనుకుంటే.. మోకాళ్లపై కూర్చొని 'విల్ యూ మ్యారీ మీ' అంటూ ప్రపోజ్ చేశాడు.

    అనేక మంది పారా అథ్లెట్లు, అధికారులు, ఇతరులు చూస్తుండగా పెరీరాను ఆంటోనియో ప్రపోజ్ చేశాడు. వెంటనే పెరీరా కూడా అవును.. నేను పెళ్లి చేసుకుంటాను అని జవాబు ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఆటగాళ్లందరూ కేరింతలు కొట్టారు. ఒలింపిక్స్‌లో పతకం గెలవక పోయినా భాగస్వామిని మాత్రం గెలుచుకున్నదని అందరూ ఆమెను అభినందించారు. ఈ లవ్ ప్రపోజల్‌ను టోక్యో పారాలింపిక్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఇక జీవితంలో ఇద్దరూ కలసి పరుగులు తీయండి' అని ఆ ఖాతాలో క్యాప్షన్ కూడా జత చేశారు. దీంతో ఒక్కసారిగా వీరి లవ్ ట్రాక్ వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా వీరి లవ్‌ను అభినందిస్తున్నారు.

    కేయులా నిద్రియా అంధురాలైనా సరే 15 ఏళ్ల నుంచే అథ్లెట్‌గా మారి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు సాధించింది. ఇటీవల ఆమెకు కోచ్‌గా ఉన్న ఆంటోనియా ఆమె ప్రతిభకు మరింత సానబెట్టాడు. 2012లో ఆఫ్రికాలోని కేప్ వర్డే ప్రభుత్వం కేయులాను స్పోర్ట్స్ మెరిట్ మెడల్‌తో సత్కరించింది.

    మరోవైపు భారత అథ్లెట్లు పారాలింపిక్స్‌లో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 పతకాలు గెలిచిన పారా అథ్లెట్లు మరో రెండు పతకాలను ఖాయం చేసుకున్నారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలు గెలవడం ఇదే తొలిసారి.

    Maria Sharapova: వెనీస్ బీచ్‌లో బికినీతో మారియా షరపోవా సందడి.. కాబోయే భర్తతో కలసి షికార్లు

    Published by:John Naveen Kora
    First published: