హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics : పారాలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్ల బృందం ఇదే.. పతాకధారి ఎవరంటే?

Olympics : పారాలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్ల బృందం ఇదే.. పతాకధారి ఎవరంటే?

పారా ఒలింపిక్స్ పతాకధారిగా మరియప్పన్ తంగవేలు

పారా ఒలింపిక్స్ పతాకధారిగా మరియప్పన్ తంగవేలు

టోక్యోలో జులై 23 నుంచి ప్రారంభం కానున్న సమ్మర్ ఒలింపిక్స్ (Tokyo Olympics) అనంతరం అక్కడే పారా ఒలింపిక్స్ (Paralampics) కూడా నిర్వహించనున్నారు. అగస్టు 24 నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్‌ పరేడ్‌లో టీమ్ ఇండియాకు ముందు పతాకథారిగా తంగవేలు ఉంటాడని పారా అథ్లెటిక్స్ చైర్మన్ సత్యనారాయణ ప్రకటించారు. రియో పారా ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్న తంగవేలు 1.89 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణ పతాకం గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. దుబాయ్‌లో 2019లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో అతడికి టోక్యో బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. ఈ నేపథ్యంలో తంగవేలునే పతాకధారిగా నియమిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 25 ఏళ్ల వయసున్న తంగవేలుకు ఇప్పటికే భారత ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించింది. పారా ఒలింపిక్స్‌కు 24 మందిని ఎంపిక చేసినట్లు ది పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రకటించింది.

పురుషులు :

దేవేంద్ర ఝాజరియా, అజీత్ సింగ్, సుందర్ సింగ్ గుర్జార్ - జావెలిన్ ఎఫ్-46

సందీప్ చౌదరి, సుమిత్ - జావెలిన్ ఎఫ్-64

మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్, వరుణ్ సింగ్ భట్టీ - హై జంప్ టీ 63

నిషాద్ కుమార్, రాంపాల్ - హై జంప్ టీ-47

సోనమ్ రాణా - షాట్ పుట్ ఎఫ్-41

నవదీప్ - జావెలిన్ ఎఫ్ -41

ప్రవీణ్ కుమార్ - హై జంప్ టీ-64

యోగేష్ కథూనియా - డిస్కస్ త్రో ఎఫ్-35

వినోద్ కుమార్ - డిస్కస్ త్రో ఎఫ్- 56

రంజీత్ భాటి - జావెలిన్ ఎఫ్-57

అర్వింద్ - షార్ట్ ఫుట్ ఎఫ్-35

టేక్ చంద్ - జావెలిన్ ఎఫ్-54

మహిళలు:

ఎక్తా భయాన్, కాషిష్ లక్రా - క్లబ్ త్రో ఎఫ్-51

భాగ్యశ్రీ జాదవ్ - షార్ట్ పుట్ ఎఫ్ - 34

సిమ్రాన్ - 100 మీటర్ల స్ప్రింట్ టీ - 13

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు