Home /News /sports /

83 Movie: '83' సినిమాలో పీఆర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి.. ఇంతకు ఎవరీ మాన్‌సింగ్? హైదరాబాదీ క్రికెటర్‌కు సినిమాకు సంబంధం ఏంటి?

83 Movie: '83' సినిమాలో పీఆర్ మాన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠి.. ఇంతకు ఎవరీ మాన్‌సింగ్? హైదరాబాదీ క్రికెటర్‌కు సినిమాకు సంబంధం ఏంటి?

హైదరాబాద్‌కు చెందిన మాన్‌సింగ్ గురించి మీకు తెలుసా?

హైదరాబాద్‌కు చెందిన మాన్‌సింగ్ గురించి మీకు తెలుసా?

83 Movie: కపిల్ డెవిల్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన కథ నేపథ్యంలో '83' అనే సినిమాను బాలీవుడ్‌లో తెరక్కెక్కించారు. ఆ సినిమాలో పంకజ్ త్రిపాఠి వేసిన పాత్ర అసలు పేరు పీఆర్ మాన్‌సింగ్. హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ పాత్రలో ఆయన కన్పించాడు. ఇంతకు మాన్ సింగ్ ఎవరు?

ఇంకా చదవండి ...
  టీమ్ ఇండియా (Team India) మొట్ట మొదటి సారి క్రికెట్ వరల్డ్ కప్ 1983లో (Cricket World Cup 1983) గెలిచింది. అప్పటికి క్రికెట్ అంటే కేవలం వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. అందులో వన్డే వరల్డ్ కప్‌ నిర్వహించడం మొదలు పెట్టిన తర్వాత రెండు సార్లు వెస్టిండీస్ (West Indies) విజేతగా నిలిచింది. మూడో సారి కూడా విండీస్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆరవీర భయంకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉండే విండీస్‌ను అండర్ డాగ్స్‌గా మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత జట్టు ఓడించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా విలేకరులతో మాటలు పడిన 'కపిల్ డెవిల్స్' (Kapil Devils).. చివరకు విశ్వ విజేతగా నిలిచింది. లార్డ్స్ మైదానంలో (The Lord's) కపిల్ దేవ్ ఎత్తిన ట్రోఫీ ఇప్పటికీ ఇండియన్ క్రికెట్‌కు ఒక ఐకాన్‌లా మారిపోయింది. ఇండియాలో క్రికెట్ అభివృద్ది చెందడానికి అక్కడే బీజం పడింది. ఇండియాలో ఆ తర్వాత క్రికెట్ క్రేజ్ చాలా పెరిగిపోయింది.

  ఇప్పుడు ఆనాటి 1983 వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో బాలీవుడ్‌లో '83' అనే సినిమా తెరకెక్కుతున్నది. కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) పాత్రను రణ్‌వీర్ సింగ్, అతడి ప్రియురాలి పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో పంకజ్ త్రిపాఠి నటిస్తున్నాడు. ఆనాటి టీమ్ ఇండియా మేనేజర్‌గా వ్యవహరించిన పీఆర్ మాన్‌సింగ్ పాత్రలో ఆయన కనిపిస్తాడు. అయితే ఎవరీ మాన్‌సింగ్? ఎక్కడ జన్మించాడు? అనే విషయాలు పరిశీలిద్దాం. పీఆర్ మాన్‌సింగ్ హైదరాబాద్ రంజీ క్రికెటర్. అతను ఒక ఆల్‌రౌండర్. కుడి చేతి వాటం బ్యాటరే కాకుండా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేస్తాడు. హైదరాబాద్ జట్టు తరపున 1965/66 సీజన్ నుంచి 1968/69 వరకు రంజీ ట్రోఫీ ఆడాడు. అలాగే మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్లూస్ జట్టు తరపున ఆడాడు.

  Beauty with Talent: ఈ అమ్మాయిలు చాలా హాట్ గురూ.. అందంతో ఆకట్టుకుంటున్న భారత మహిళ క్రీడాకారిణులు


  ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పీఆర్ మాన్‌సింగ్ ఆడింది 5 మ్యాచులే అయినా.. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా మాత్రం చాలా ఫేమస్ అయ్యాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత భారత జట్టు అసిస్టెంట్ మేనేజర్‌గా తొలి సారి 1978లో పాకిస్తాన్ టూర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత టీమ్ ఇండియ వెంటే ఉంటూ అసిస్టెంట్ మేనేజర్‌ స్థాయి నుంచి మేనేజర్‌గా ఎదిగాడు. 1983 వరల్డ్ కప్ టీమ్‌కు తొలి సారిగా మేనేజర్ అయ్యాడు. ఆ సమయంలో పీఆర్ మాన్‌సింగ్, నిరంజన్ షా (బీసీసీఐ మాజీ కార్యదర్శి)కి మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. దీంతో బీసీసీఐ జనరల్ మీటింగ్‌లో ఓటింగ్ జరిగింది. మాన్‌సింగ్ 15-13 ఓట్ల మెజార్టీ లభించడంతో మాన్‌సింగ్ మేనేజర్ అయ్యాడు.

  Rachin Ravindra: రచిన్ రవీంద్ర నాన్న కూడా క్రికెటరే.. అనంతపూర్‌తో రచిన్‌కు ఉన్న సంబంధం ఏంటి? రచిన్‌కు జవగళ్ శ్రీనాథ్ ఏమవుతాడు?


  1983 వరల్డ్ కప్ క్రికెట్ జట్టుకు ఎవరిని కెప్టెన్ చేయాలనే విషయంపై బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాన్‌సింగ్ కూడా సభ్యుడు. కపిల్ దేవ్‌ కెప్టెన్ కావాలని మాన్‌సింగ్ బలంగా కోరాడు. అనుకున్నట్లుగానే కపిల్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత మాన్‌సింగ్, కపిల్‌దేవ్ సెలెక్టర్లతో కలసి 1983 జట్టును ఎంపిక చేశారు. ఇలా తొలి వరల్డ్ గెలుపు వెనుక మాన్‌సింగ్ కష్టం చాలా ఉన్నది. అందుకే ఆ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ చాలా ప్రధానంగా ఉంటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా మాన్‌సింగ్ పని చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు.
  Published by:John Kora
  First published:

  Tags: 83 Biopic, Kapil Dev, Team india, World cup

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు