పాండ్యాకు మరో దెబ్బ : బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించిన జిల్లెట్

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న పాండ్యా, రాహుల్ మహిళలపై అభ్యంతర కామెంట్స్ చేయడం వారి కెరీర్‌కు ముప్పుగా పరిణమించింది. షోలో హద్దులు దాటి మాట్లాడిన పాండ్యా, రాహుల్ చేజేతులా కెరీర్‌ను పాడు చేసుకున్నట్టయింది..

news18-telugu
Updated: January 12, 2019, 12:11 PM IST
పాండ్యాకు మరో దెబ్బ : బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించిన జిల్లెట్
హార్థిక్ పాండ్యా(File)
news18-telugu
Updated: January 12, 2019, 12:11 PM IST
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా చేసిన కామెంట్స్ కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ సస్పెన్షన్ ఎదుర్కొంటున్న పాండ్యా.. తన బ్రాండ్ వాల్యూ కూడా పోగొట్టుకుంటున్నాడు. తాజాగా జిల్లెట్ సంస్థ పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్‌ హోదా నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

పాండ్యా ప్రస్తుతం ఒప్పో, గల్ఫ్ ఆయిల్, సిన్ డెనిమ్, డీఎఫ్‌వై స్పోర్ట్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. జిల్లెట్ తాజా నిర్ణయంతో మిగతా బ్రాండ్స్ కూడా పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పిస్తాయా? అన్న చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పాండ్యా కెరీర్ మరింత ఇరకాటంలో పడే అవకాశం కనిపిస్తోంది.


కాగా, ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న పాండ్యా, రాహుల్ మహిళలపై అభ్యంతర కామెంట్స్ చేయడం వారి కెరీర్‌కు ముప్పుగా పరిణమించింది. షోలో హద్దులు దాటి మాట్లాడిన పాండ్యా.. తాను ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిలను తాను ఎలా చూసేది అభ్యంతరకరంగా చెప్పుకొచ్చాడు. అటు కేఎల్ రాహుల్ కూడా.. జేబులో కండోమ్ ప్యాకెట్ చూసి.. తన తండ్రి కూడా 'ఫర్వాలేదు రక్షణ కవచం' వాడుతున్నావు అని కామెంట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. పాండ్యా, రాహుల్ చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపి.. బీసీసీఐ వేటు వేసేదాకా వెళ్లింది.

First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...