• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • PANDYA BROTHERS HARDIK AND KRUNAL DANCING WITH THEIR PARTNERS NATASA STANKOVIC AND PANKHURI SHARMA VIDEO GOES VIRAL SRD

Pandya Brothers : భార్యలతో కలిసి పాండ్యా బ్రదర్స్ చిందులు.. వైరల్ వీడియో..

Pandya Brothers : భార్యలతో కలిసి పాండ్యా బ్రదర్స్ చిందులు.. వైరల్ వీడియో..

Photo Credit : Instagram

Pandya Brothers : పాండ్యా బ్రదర్స్, వాళ్ల భార్యలు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో.. నలుగురు కలిసి సందడి చేశారు. పాండ్యా బ్రదర్స్.. తమ భార్యలతో కలిసి స్టెప్పులేశారు. ఆ వీడియోని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. విజయం కోసం ప్రతి జట్టు చివరి వరకూ పోరాడుతున్నాయ్. ఇక, డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఈ సారి కూడా దుమ్ము రేపే ప్రదర్శన చేస్తోంది. సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ..బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో దూసుకొచ్చింది. ఇక, ముంబై ఇండియన్స్ లో క్రికెట్ బ్రదర్స్ హార్దిక్, కృనాల్ సత్తా చాటుతున్నారు. మొన్న.. ఇంగ్లండ్ సిరీస్ లో టీమిండియాలోనూ కలిసి ఆడిన ఈ అన్నదమ్ములు (Pandya Brothers )..ఐపీఎల్ లోనూ రెచ్చిపోతున్నారు. ఇక, ఈ బ్రదర్స్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా.. మోడల్ నటాషాను, కృనాల్.. నటి పంకూరీ శర్మను పెళ్లి చేసుకున్నారు.వీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో.. నలుగురు కలిసి సందడి చేశారు. పాండ్యా బ్రదర్స్.. తమ భార్యలతో కలిసి స్టెప్పులేశారు. ఆ వీడియోని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.

    అయితే.. వీరు నలుగురు కలిసి దిగిన ఫోటోని నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసి.. దానికి పాండ్యా స్వాగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ వరస విజయాలతో తమ జట్టు తరపున అదరగొడుతూనే.. మధ్యలో ఇలా భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హార్దిక్ పాండ్యా కి ఇటీవల కుమారుడు కూడా జన్మించాడు. బాబుకి అగస్త్య అనే పేరు కూడా ఖరారు చేశారు. అప్పుడప్పుడు తమ కుమారుడితో కలిసి సందడి చేస్తూ.. వాటిని కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు.






    ఈ అన్నదమ్ములు జోడిలకు ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మధ్యనే పాండ్యా బ్రదర్స్ తండ్రి చనిపోయారు. ఆ సమయంలో వీరిద్దరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక, ఈ ఆల్ రౌండర్లు ముంబై ఇండియన్స్ కి ఎంతో కీలకం. వీరిద్దరి రాణిస్తే ముంబైకి మరోసారి తిరుగుండదు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు