‘పాండ్యా... ఈ రోజు చేసోచ్చావా...’ స్టేడియంలో హార్ధిక్‌ను ట్రోల్ చేసిన యువతి...

ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ... హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్న ప్రేక్షకులు... హాట్ టాపిక్‌గా మారిన మహిళా ప్రేక్షకురాలి ట్రోలింగ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 5:54 PM IST
‘పాండ్యా... ఈ రోజు చేసోచ్చావా...’ స్టేడియంలో హార్ధిక్‌ను ట్రోల్ చేసిన యువతి...
హార్దిక్ పాండ్యా
  • Share this:
‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొని, అత్యుత్యాహంతో రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత పరిణామాల కారణంగా సస్పెషన్ కూడా ఎదుర్కొన్నాడు. ఏదో నోటి దురుసు కారణంగా ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియక... ఫ్రస్టేషన్‌లోకి వెళ్లి, ఎలాగోలా వివాదాలన్నింటి నుంచీ బయటపడి మళ్లీ టీమ్ లోకి వచ్చాడు. వన్డేల్లోనూ, టీ20ల్లో సత్తా చాటి... వివాదం గురించి మరిచిపోయేలా చేశాడు. అయితే ‘కాఫీ ఎఫెక్ట్’ మాత్రం మనోడిని ఇంకా వదలడం లేదు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చిన సమయంలో అతన్ని గేలి చేస్తూ ఓ మహిళా అభిమాని చేసిన ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘కాఫీ విత్ కరణ్’ షో తాను సెక్స్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ‘ఆజ్ కర్ కే ఆయా...’ (ఈరోజు చేసి వచ్చా) అని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేంత స్వేచ్ఛ ఉందని చెప్పాడు పాండ్యా.ఈ కామెంట్స్ కారణంగా పెద్ద దుమారమే రేగింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఓ మహిళా అభిమాని... ‘పాండ్యా ఆజ్ కర్ కే ఆయా క్యా’ (ఈరోజు చేసి వచ్చావా?) అని ఫ్లకార్డులో ప్రదర్శించింది. రెండో టీ20 మ్యాచ్‌లో మహిళ ప్రదర్శించిన ఈ వినూత్న ట్రోలింగ్... టీవీల్లో ప్రత్యేక్షం కావడంతో మనోడిని మరోసారి ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్లు. మూడో టీ20 మ్యాచ్‌లో కూడా పాండ్యాకు ఇలాంటి ట్రోలింగ్‌ ఎదురైంది. హార్దిక్ సిక్స్ కొట్టి సమయంలో ‘సెక్సీ సిక్స్’ అంటూ ఫ్లకార్డు ప్రదర్శించారు స్టేడియంలో అభిమానులు. ‘కాఫీ కప్పు’ హాట్ తగ్గిందనుకున్న హార్దిక్... ప్రేక్షకుల నుంచి ఎదురువుతున్న ట్రోలింగ్ చూసి... నవ్వాలో, ఏడవాలో తెలియక తికమకపడుతున్నాడు.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>