భారతీయురాలిని పెళ్లి చేసుకున్న పాక్ బౌలర్ హసన్ అలీ..

Pakistan Bowler Hassan Ali married Indian : ఇంగ్లాండ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన షమీమా ప్రస్తుతం దుబాయ్‌లో పనిచేస్తున్నారు. అక్కడే హసన్ అలీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.

news18-telugu
Updated: August 21, 2019, 1:08 PM IST
భారతీయురాలిని పెళ్లి చేసుకున్న పాక్ బౌలర్ హసన్ అలీ..
హసన్ అలీ,షమీమా దంపతులు
news18-telugu
Updated: August 21, 2019, 1:08 PM IST
మరో పాకిస్తానీ క్రికెటర్ భారతీయ యువతిని వివాహం చేసుకున్నాడు. పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భారత్‌లోని హర్యానాకు చెందిన షమీ అర్జూ(25)ను దుబాయ్‌లో వివాహం చేసుకున్నాడు. దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో మంగళవారం రాత్రి వీరి నిఖా జరిగింది. కొద్దిమంది బంధువులు,సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నిఖా తంతు జరిపించారు. పెళ్లి దుస్తుల్లో ఇద్ద‌రూ మెరిసిపోయారు. బ్లాక్ షేర్వానీలో హ‌స‌న్‌, రెడ్ & గోల్డ్ డ్రెస్‌లో ఆర్జూ ఫోటోలకు పోజులిచ్చారు.

కాగా, ఇంగ్లాండ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన షమీమా ప్రస్తుతం దుబాయ్‌లో పనిచేస్తున్నారు. అక్కడే హసన్ అలీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. మొదట హసన్ అలీ షమీమాకు ప్రపోజ్ చేయగా.. ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో దుబాయ్‌లో వివాహం చేసుకున్నారు. పాకిస్తానీ క్రికెటర్లు భారత మహిళలను పెళ్లి చేసుకోవడం ఇదేమీ కొత్త కాదు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అలాగే జహీర్ అబ్బాస్,మోసిన్ ఖాన్ వంటి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా భారత మహిళలనే పెళ్లి చేసుకున్నారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...