World Cup 2019: ఇది విన్నారా.. పాకిస్తాన్ గెలిస్తే భారత అభిమానులు పండగ చేసుకున్నారు..

ICC Cricket World Cup 2019 | Pak vs NZ | పాక్ ఓడిపోవాలని కోరుకునే సగటు భారత అభిమాని.. ఆ దేశం గెలిచేందుకు మద్దతు ఇవ్వడం విశేషం. న్యూజిలాండ్‌-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 27, 2019, 2:43 PM IST
World Cup 2019: ఇది విన్నారా.. పాకిస్తాన్ గెలిస్తే భారత అభిమానులు పండగ చేసుకున్నారు..
భారత్, పాక్ అభిమానులు
  • Share this:
భారత్, పాక్.. ఒక దేశానికి మరో దేశం అంటే పడదు. ఎదురెదురుగా కనిపిస్తేనే కత్తులు దూసుకునేంత కోపంతో చూసుకుంటారు. అలాంటిది క్రికెట్ మ్యాచ్ అయితే.. యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఒక దేశాన్ని మరో దేశం చిత్తుగా ఓడించాలనుకుంటుంది. అభిమానులు కూడా ఉద్వేగంతో, కోపంతో, గెలవాలన్న పట్టుదలతో రగిలిపోతారు. ప్రత్యర్థి సిక్స్ కొట్టినా, వికెట్ తీసినా తట్టుకోలేరు. అంతలా ఉంటుంది రెండు దేశాల మధ్య వైరం. కానీ, ఇంగ్లండ్ గడ్డపై అద్భుతం జరిగింది. పాక్ ఓడిపోవాలని కోరుకునే సగటు అభిమాని.. ఆ దేశం గెలిచేందుకు మద్దతు ఇవ్వడం విశేషం. న్యూజిలాండ్‌-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది.

న్యూజిలాండ్‌ బౌలర్లను పాక్ బ్యాట్స్‌మెన్ వీరబాదుడు బాదుతుంటే భారత అభిమానులు సైతం పండుగ చేసుకున్నారు. ‘పొరుగు దేశం.. మద్దతు.. కమాన్ పాకిస్తాన్’ అన్న ఫ్లెక్సీలతో భారత అభిమానులు దర్శనమిచ్చారు. పాక్ మ్యాచ్ గెలిచాక.. ఓ భారత అభిమాని, పాక్ అభిమాని కలిసి బాంగ్రా నృత్యం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.





Published by: Shravan Kumar Bommakanti
First published: June 27, 2019, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading