ICC Cricket World Cup, 2019 Pakistan vs Sri Lanka: పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ వర్షార్పణమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దుచేసి ఇరుజట్లు చెరోపాయింట్ ఇచ్చారు. కుండపోత వర్షంతో కనీసం టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. దాంతో మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 03 గంటలకు మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. అంతముందే వర్షం ప్రారంభమైంది. పిచ్, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గితే 20ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని భావించారు. కానీ ఎంతకూ వాన తగ్గకపోవడంతో రాత్రి 08.30 గంటలకు మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు.
Pakistan and Sri Lanka share points as their #CWC19 game in Bristol has been abandoned. 🌧️ https://t.co/6W3YnubsKg
— ICC (@ICC) June 7, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket World Cup 2019, ICC Cricket World Cup 2019, Pakistan, Sri Lanka, World Cup 2019