ICC WORLD CUP 2019 | నిలకడగా ఆడుతున్న పాకిస్థాన్...సౌతాఫ్రికా బౌలర్లకు పరీక్ష...

Pakistan vs South Africa Live Score, ICC World Cup 2019 Match at London: పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే నాటికి పాకిస్థాన్ స్కోరు 82 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.

news18-telugu
Updated: June 23, 2019, 4:41 PM IST
ICC WORLD CUP 2019 | నిలకడగా ఆడుతున్న పాకిస్థాన్...సౌతాఫ్రికా బౌలర్లకు పరీక్ష...
పాకిస్థాన్ శుభారంభం...
  • Share this:
Pakistan vs South Africa Live Score, ICC World Cup 2019 Match at London: లండన్ వేదికగా జరుగుతున్న పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే నాటికి పాకిస్థాన్ స్కోరు 82 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ శుభారంభం ఇవ్వగా తొలివికెట్ కు వీరి జోడి 81 పరుగులు చేసింది. 14 ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో ఫకర్ జమాన్ (44) స్లిప్స్ లో సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్, చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ లో పరువు నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఐదు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ గెలిచి మూడు మ్యాచుల్లో ఓడిపోయిన పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు ఆవిరైనట్లే, అదే కోవలో సౌతాఫ్రికా సైతం సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లే, ఈ నేపథ్యంలో ఇరు జట్లు కేవలం టోర్నీలో మిగితా మ్యాచుల్లో సంచలనాలు నమోదు చేసి గౌరవంగా టోర్నీ నుంచి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి.
Published by: Krishna Adithya
First published: June 23, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading