ICC World Cup 2019 | సఫారీలపై పాకిస్థాన్ ఘన విజయం...సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాక్ బౌలర్లు...

Pakistan vs South Africa Live Score, ICC World Cup 2019 Match at London: పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో పాక్ ఎట్టకేలకు ఘన విజయం సాధించింది. 309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా చతికిల పడింది. పాక్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా చేతులెత్తేసింది.

news18-telugu
Updated: June 23, 2019, 11:03 PM IST
ICC World Cup 2019 | సఫారీలపై పాకిస్థాన్ ఘన విజయం...సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాక్ బౌలర్లు...
విజయానందంలో పాక్ ఆటగాళ్లు
  • Share this:
Pakistan vs South Africa Live Score, ICC World Cup 2019 Match at London: లండన్ వేదికగా జరుగుతున్న పాకిస్థాన్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ లో పాక్ ఎట్టకేలకు ఘన విజయం సాధించింది. 309 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా చతికిల పడింది. పాక్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా చేతులెత్తేసింది. డికాక్ (47), డుప్లెసిస్ (63) రాణించినప్పటికీ సఫారీ స్కోరు బోర్డు లక్ష్య ఛేదనలో తరచూ వికెట్లు పడటంతో వేగంగా కదలలేదు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 259/9 పరుగులకే పరిమితమైంది. దీంతో సౌతాఫ్రికాపై పాకిస్థాన్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇదిలాఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 308 పరుగులు చేయగా, సౌతాఫ్రికా ఎదుట 309 పరుగులు భారీ లక్ష్యాన్ని నిలిపింది. చివరి పది ఓవర్లలో 90 పరుగులు సాధించడంతో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ చెలరేగడంతో పాకిస్థాన్ స్కోరు 300 దాటింది. పాక్ బ్యాట్స్ మెన్ లో హారిస్ సొహైల్ కేవలం 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం హారిస్ (89) సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి 49వ ఓవర్లో ఓటయ్యాడు.

ఇదిలా ఉంటే ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ శుభారంభం ఇవ్వగా తొలివికెట్ కు వీరి జోడి 81 పరుగులు చేసింది. 14 ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో ఫకర్ జమాన్ (44) స్లిప్స్ లో సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బాబర్ ఆజమ్ అర్థసెంచరీ చేశాడు. మహ్మద్ హఫీజ్ (20) భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగి హారీస్ సొహైల్ వరుస బౌండరీలు బాదటంతో స్కోరు 200 దాటింది. నాలుగో వికెట్ కు బాబర్ ఆజం, హరీస్ సొహైల్ మధ్య 34 బంతులకే 50 పరుగులు చేశారు. బాబర్ ఆజం 61 పరుగుల్లో 50 పరుగులు 14వ ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సెటిల్డ్ బ్యాట్స్‌మాన్ బాబర్ ఆజమ్ (69) చెత్త షాట్ ట్రై చేసి ఎన్గిడి బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి 3 వికెట్లు పడగొట్టగా, తాహిర్ 2, పెహ్లుకువాయో, మార్క్‌రామ్ చెరో వికెట్ పడగొట్టారు.


Published by: Krishna Adithya
First published: June 23, 2019, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading