Pakistan vs Bangladesh | సర్ఫరాజ్ 500 రన్స్ టార్గెట్‌పై నీళ్లు...కెప్టెన్ మాటకు విలువ ఇవ్వని పాక్ ఆటగాళ్లు

Pakistan vs Bangladesh Live Score, ICC World Cup 2019 Match at Lord's : టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఏ దశలో కూడా ధాటిగా ఆడే ప్రదర్శన ఇవ్వకుండా ఆడుతోంది. 25 ఓవర్లు ముగిసే నాటికి పాకిస్థాన్ స్కోరు కేవలం ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు మాత్రమే సాధించింది.

news18-telugu
Updated: July 5, 2019, 5:17 PM IST
Pakistan vs Bangladesh | సర్ఫరాజ్ 500 రన్స్ టార్గెట్‌పై నీళ్లు...కెప్టెన్ మాటకు విలువ ఇవ్వని పాక్ ఆటగాళ్లు
సర్ఫరాజ్ (Image : Twitter)
news18-telugu
Updated: July 5, 2019, 5:17 PM IST
Pakistan vs Bangladesh Live Score, ICC World Cup 2019 Match at Lord's : మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ పై 500 పరుగులు సాధిస్తామని ప్రకటించిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ మాటలు, చివరకు నీటిమూటలుగా మిగిలాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఏ దశలో కూడా ధాటిగా ఆడే ప్రదర్శన ఇవ్వకుండా ఆడుతోంది. 25 ఓవర్లు ముగిసే నాటికి పాకిస్థాన్ స్కోరు కేవలం ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు మాత్రమే సాధించింది. అది కూడా కేవలం 4.40 పరుగుల రన్ రేట్ మాత్రమే సాధించింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 311 పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే న్యూజిలాండ్ కన్నా మెరుగైన రన్ రేట్ సాధించి పాకిస్థాన్ సెమీస్ లోకి అడుగుపెడుతుంది. అయితే పాక్ ప్రస్తుతం ఆడుతున్న తీరు చూస్తే తొలి ఇన్నింగ్స్ స్కోరు కనీసం 300 కూడా దాటడం అనుమానమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సర్ఫరాజ్ వ్యాఖ్యలపై నెటిజన్లు జోకులు పేల్చడం విశేషం.









First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...