Pakistan vs Bangladesh | కెప్టెన్ మాటను కేర్ చేయని పాక్...గాయంతో వెనుదిరిగిన సర్ఫరాజ్...బంగ్లాదేశ్ లక్ష్యం 316 రన్స్

500 పరుగులు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు రాబట్టింది. పాకిస్థాన్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. పాకిస్థాన్ బంగ్లాదేశ్ ను 316 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉండగా, తేడా సంగతి దేవుడెరుగు.. కనీసం 316 పరుగుల మార్కును కూడా అందుకోలేక పోయింది.

news18-telugu
Updated: July 5, 2019, 8:04 PM IST
Pakistan vs Bangladesh | కెప్టెన్ మాటను కేర్ చేయని పాక్...గాయంతో వెనుదిరిగిన సర్ఫరాజ్...బంగ్లాదేశ్ లక్ష్యం 316 రన్స్
Image : twitter
  • Share this:
Pakistan vs Bangladesh Live Score, ICC World Cup 2019 Match at Lord's : 500 పరుగులు సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు రాబట్టింది. అయితే ఒక రకంగా బంగ్లాదేశ్ పై మంచి ప్రారంభమే అందుకున్న పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (13) తక్కువ పరుగులకే ఔటయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బాబర్ ఆజమ్ (96), ఇమామ్ ఉల్ హక్ (100) రాణించడంతో గౌరవ ప్రదమైన స్కోరు దిశగా కదిలింది. అయితే ఈ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మహ్మద్ హఫీజ్ (27), హరిస్ సొహైల్(6), వాహబ్ రియాజ్ (3), షాదబ్ ఖాన్ (1), మహ్మద్ ఆమీర్ (8) తక్కువ పరుగులకే ఔటయ్యారు. అయితే ఇదే క్రమంలో కెప్టెన్ సర్ఫరాజ్ (3) పరుగులకే రిటైర్డ్ హర్ట్ అయి వెనుదిరిగాడు. బంగ్లా దేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్ రెహమాన్ 5 వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సైఫుద్దీన్ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. పాకిస్థాన్ బంగ్లాదేశ్ ను 316 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉండగా, తేడా సంగతి దేవుడెరుగు.. కనీసం 316 పరుగుల మార్కును కూడా అందుకోలేక పోయింది. దీంతో న్యూజిలాండ్ అధికారికంగా సెమీస్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ దే పైచేయి కావడం గమనార్హం.
Published by: Krishna Adithya
First published: July 5, 2019, 7:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading