Afghanistan vs Pakistan | పాక్‌కు చెమటలు పట్టించి...చివరకు ఓడిన ఆఫ్గనిస్థాన్...

Pakistan vs Afghanistan Live Score, ICC World Cup 2019 Match in Leeds: చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మ్యాచ్ లో చివరి ఓవర్లో పాకిస్థాన్ నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ 228 పరగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 49.4 వద్ద లక్ష్యం అందుకొని 3 తేడాతో విజయం సాధించింది.

news18-telugu
Updated: June 29, 2019, 10:42 PM IST
Afghanistan vs Pakistan | పాక్‌కు చెమటలు పట్టించి...చివరకు ఓడిన ఆఫ్గనిస్థాన్...
(Image : twitter)
  • Share this:
Pakistan vs Afghanistan Live Score, ICC World Cup 2019 Match in Leeds: చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మ్యాచ్ లో చివరి ఓవర్లో పాకిస్థాన్ నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరగులు చేయగా, పాకిస్థాన్ 228 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఆఫ్గనిస్థాన్ బౌలర్లు దడ పుట్టించగా పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి చివర్లో 49.4 ఓవర్ల వద్ద లక్ష్యం పూర్తి చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే లక్ష్య ఛేదనలో మొదలు పెట్టిన పాకిస్థాన్ రెండో బంతికే ఓపెనర్ ఫకర్ జమాన్ డకౌటయ్యాడు. అనంతరం ఇమాముల్ హక్ (36), బాబర్ ఆజమ్(45) ఇద్దరూ స్కోరు బోర్డును నిలబెట్టే యత్నం చేశారు. దీంతో రెండో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వెంట వెంటనే వికెట్లు పడటంతో పాకిస్థాన 156 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఒక దశలో ఓటమి అంచుల్లో నిలిచింది. కెప్టెన్ సర్ఫరాజ్ (18) సైతం రనౌట్ గా వైదొలగడంతో జట్టు మరింత కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో ఇమాద్ వసీం (49) చివరి వరకూ నాటౌట్ గా నిలిచి ఒత్తిడిలో నిలవడంతో పాకిస్థాన్ ఎట్టకేలకు ఊపిరిపీల్చుకుంది. ఆఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబుర్ రహమాన్, మహ్మద్ నబీలు చెరో రెండు వికెట్లు పడగొట్టి పాక్ బ్యాట్స్ మెన్ ను కంగారు పెట్టారు.



First published: June 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>