India vs Pakistan రోహిత్ శర్మ రనౌట్ మిస్.. పాకిస్తాన్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు..

ICC World Cup 2019 | రోహిత్ శర్మ పిచ్‌లో సగం దూరానికి పైగా వచ్చేశాడు. అయితే, బాల్‌ను ఆపిన ఫకార్ జమాన్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.

news18-telugu
Updated: June 16, 2019, 5:21 PM IST
India vs Pakistan రోహిత్ శర్మ రనౌట్ మిస్.. పాకిస్తాన్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు..
రోహిత్ శర్మ రన్ ఔట్ మిస్ (Image:Twitter)
news18-telugu
Updated: June 16, 2019, 5:21 PM IST
ICC World Cup 2019 | భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దాయాది జట్టు ఫీల్డింగ్ తీరు మీద నెటిజన్లు ఫుల్‌గా ట్రోలింగ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ‌ను రనౌట్ చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకోవడంతో పాక్ ఫీల్డర్ల మీద బీభత్సంగా జోక్స్ పేలుతున్నాయి. టీమిండియా స్కోర్ 50 పరుగుల కంటే తక్కువగానే ఉన్నసమయంలో కేఎల్ రాహుల్ ఓ బాల్‌ను ఆఫ్ సైడ్ ఆడాడు. రోహిత్, రాహుల్ కలసి ఒక రన్ తీశారు. రెండో రన్ విషయంలో గందరగోళం ఏర్పడింది. రోహిత్ శర్మ పిచ్‌లో సగం దూరానికి పైగా వచ్చేశాడు. అయితే, బాల్‌ను ఆపిన ఫకార్ జమాన్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. బాల్‌ను రాంగ్ సైడ్ విసిరాడు. అలా కాకుండా కీపర్ సర్ఫరాజ్ వైపు విసిరి ఉంటే రోహిత్ శర్మ ఔట్ అయి ఉండేవాడు. కానీ, ఆ చాన్స్ మిస్ అయింది. దీనిపై నెటిజన్లు పాకిస్తాన్‌ను ఆడుకుంటున్నారు. బంగారం లాంటి అవకాశాన్ని రోహిత్ శర్మ వినియోగించుకున్నాడు. వరల్డ్ కప్‌లో రెండో సెంచరీ చేశాడు. 85 బంతుల్లో 100 పరుగులు చేశాడు.First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...