ఔరా యాసిర్ షా...82 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ స్పిన్నర్

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా...ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గత ఎనిమిది దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డ్‌‌ను బద్దలు కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 82 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.

news18-telugu
Updated: December 6, 2018, 9:55 PM IST
ఔరా యాసిర్ షా...82 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ స్పిన్నర్
పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా ( ICC / twitter )
  • Share this:
ఆట ఏదైనా...రికార్డ్‌లున్నవి బద్దలు కొట్టడానికే. క్రికెట్‌‌ గేమ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పాత రికార్డ్‌లు బద్దలవ్వడం...కొత్త రికార్డ్‌లు నమోదవ్వడం సర్వసాధారణమే. పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా...ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గత ఎనిమిది దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డ్‌‌ను బద్దలు కొట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 82 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసి చరిత్ర సృష్టించాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్‌లను మించిన ఫార్మాట్‌ లేదు. వన్డే, ట్వంటీ ట్వంటీ వంటి పాపులర్, క్రేజీ ఫార్మాట్స్‌ కంటే టెస్ట్‌లు ఆడటాన్నే క్రికెటర్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.

ఆటగాళ్ల సత్తాకు అసలు సిసలు పరీక్ష టెస్ట్ ఫార్మాట్ మాత్రమే. అటువంటి ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మాట్‌లో 32 ఏళ్ల పాక్ స్పిన్నర్ యాసిర్ షా చరిత్రను తిరగరాశాడు. గత 82 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డ్‌ను యాసిర్ బ్రేక్ చేశాడు.


న్యూజిలాండ్‌-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ తొలి బంతికి విలియమ్ సోమర్‌విల్లేను ఔట్ చేసి...200 వికెట్ల క్లబ్‌లో ఎంటరయ్యాడు. కేవలం 33 టెస్ట్‌ల్లోనే వికెట్ల డబుల్ సెంచరీ సాధించి..అంతర్జాతీయ టెస్ట్‌ ఫార్మాట్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌ క్రియేట్ చేశాడు.

కనీ వినీ ఎరుగని రీతిలో కేవలం 33 టెస్ట్‌ల్లోనే 200 వికెట్ల మార్క్ దాటి హిస్టరీ రీ క్రియేట్ చేశాడు. 1936లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్స్‌ టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గ్రిమ్మెట్స్‌ అప్పట్లో 36 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

82 ఏళ్ల తర్వాత అదే రికార్డ్‌ను యాసిర్ బద్దలు కొట్టి..సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ పాక్ లెగ్ స్పిన్నర్ లేటు వయసులోనూ రికార్డ్‌ల మోత మోగిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు