Babar Azam : " రాబోయే వరల్డ్ కప్ లో టీమిండియాపై మాదే గెలుపు ".. పగటి కలలు కంటున్న పాక్ కెప్టెన్..

Babar Azam

Babar Azam : ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను హాట్ ఫేవరెట్ జట్లగా నిపుణులు పరిగణిస్తున్నారు. మరోవైపు పొట్టి కప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

  • Share this:
    అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్ట్ గా టీ20 ప్రపంచకప్‌ 2021 (T-20 World Cup 2021) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. మెగా టోర్నీ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను హాట్ ఫేవరెట్ జట్లగా నిపుణులు పరిగణిస్తున్నారు. మరోవైపు పొట్టి కప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అక్టోబర్ 24 న జరిగే దాయాదుల పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఇక, లేటెస్ట్ గా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Pakistan Skipper Babar Azam) పొట్టి ప్రపంచకప్‌పై స్పందించాడు. ఈసారి తమ జట్టు టీమిండియాపై పైచేయి సాధిస్తుందని చెప్పాడు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి.

    పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త ఛైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja)తో బాబర్ అజామ్ సమావేశం అయ్యాడు. ఈ సమావేశం అనంతరం బాబర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదటి మ్యాచులోనే టీమిండియాకు ఎదుర్కోవడంను ఎలా ఫీల్ అవుతున్నారు అని ఓ విలేకరి ప్రశ్నించగా... " పాకిస్థాన్​తో పోల్చితే భారత జట్టు మరింత ఒత్తిడిలో ఉంటుంది. టీమిండియాను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తాం. కోహ్లీసేనపై మాదే పైచేయి. వారిని కచ్చితంగా ఓడిస్తాం "అని అన్నాడు.

    ఇది కూడా చదవండి :  వీడెక్కడ దొరికాడ్రా బాబూ... నాలుగో టెస్ట్ లోనూ జార్వో మామ ఎంట్రీ.. ఈ సారి ఏం చేశాడంటే..

    అయితే, పాక్ కెప్టెన్ వ్యాఖ్యలపై భారత్ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. చరిత్రను గుర్తుపెట్టుకోవాలని.. వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ ను పాక్ ఎప్పుడూ ఓడించలేదన్న విషయాన్ని మర్చిపోవద్దని కామెంట్ చేస్తున్నారు. అప్పుడే పగటి కలలు కన్నద్దని మరికొందరు పాక్ కెప్టెన్ కు సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
    Published by:Sridhar Reddy
    First published: