Babar Azam: బాబర్ అజమ్ తండ్రి బయట ఏడ్చేశాడు.. కానీ బాబర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం చేశాడో తెలుసా?

భారత్‌పై విజయం తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ అజమ్ ఏం చేశాడంటే..!

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్.. ఆ దేశానికి తిరుగు లేని విజయాన్ని అందించి టీ20 వరల్డ్ కప్‌లో శుభారంభాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లిన జట్టును ఉద్దేశించి బాబర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • Share this:
  పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket Team)  చరిత్రలో ఏ కెప్టెన్ సాధించలేని ఘనతను బాబర్ అజమ్ (Babar Azam) సాధించాడు. పాకిస్తాన్ టీమ్ వన్డే, టీ20 వరల్డ్ కప్‌లలో (T20 World Cup) ఇంత వరకు టీమ్ ఇండియాను (Team India) ఓడించలేక ఒక పెద్ద అవమానాన్ని మూటగట్టుకున్నది. ఎన్నో ఏళ్లుగా ఒక మచ్చలా వెంటాడుతున్న ఆ ఓటములన్నింటికీ కెప్టెన్ బాబర్ అజమ్ ఆదివారం సమాధానం చెప్పాడు. ఇండియాపై 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఫీల్డింగ్ సమయంలో సరైన వ్యూహాలతో భారత్ బ్యాటింగ్ లైనప్ దెబ్బ తీసి.. ఆ తర్వాత రిజ్వాన్‌తో కలసి వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించి గొప్ప విజయాన్ని అందించాడు. ఇండియాపై గెలిచిన వెంటనే బాబర్ అజమ్ తండ్రి అజామ్ సిద్దిఖి భావోద్వేగానికి లోనయ్యాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం గ్యాలరీల్లో కూర్చొని ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూశాడు. పాకిస్తాన్ విజయం సాధించగానే అజామ్ సిద్దిఖి ఏడ్చేశాడు. పక్కన ఉన్న వాళ్లు తండ్రికి శుభాకంక్షలు చెబుతూ సంబరాలు చేసుకున్నారు. కొడుకు విజయాన్ని చూసి ఏ తండ్రి అయినా ఇలాగే గర్విస్తాడంటూ చాలా మంది ట్వీట్లు చేశారు.

  అజామ్ సిద్దికి భావోద్వేగానికి గురైన వీడియోను ఒక వ్యక్తి పోస్టు చేశాడు. 'ఈయన బాబర్ అజమ్ తండ్రి సిద్దిఖి. అతడి గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. 2012లో ఒక వలీమా ఫంక్షన్‌లో అతడిని కలిశాను. అప్పటికి బాబర్ ఇంకా పాకిస్తాన్ జాతీయ జట్టులోకి రాలేదు. కానీ ఆ సమయంలో సిద్దికి అన్న మాటలు మాత్రం గుర్తున్నాయి. ఒక్కసారి బాబర్ జట్టులోకి రానివ్వు.. మొదానం మొత్తం బాబర్‌దే' అంటే మజర్ అర్షద్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఫ్యాన్స్ అంతా దుబాయ్ స్టేడియంలో సంబరాలు జరుపుకుంటూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

  Shaheen Afridi: టీమ్ ఇండియాను కుప్పకూల్చిన షాహీన్ అఫ్రిదికి లెజెండరీ షాహీద్ అఫ్రిది ఏమవుతాడు? వారిద్దరి మధ్య సంబంధం ఏంటి?
  ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ జట్టు అంతా డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశం అయ్యారు. 'ఈ విజయాన్ని మనం తప్పకుండా ఆస్వాదించాలి. హోటల్‌కు వెళ్లిన తర్వాత మన ఫ్యామిలీస్‌తో సెలెబ్రేట్ చేసుకుందాం. భారత్‌పై గెలిచాం కదా అని మిగతా మ్యాచ్‌లను వదిలేయవద్దు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ మాత్రమే అయిపోయింది. మన లక్ష్యం వరల్డ్ కప్ గెలవడమే. అందరూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయడి కానీ.. మనం వచ్చింది కప్ గెలవడానికి అని మర్చిపోవద్దు.' అంటూ బాబర్ సందేశమిచ్చాడు. పాకిస్తాన్ విజయంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అభినందించారు. మ్యాచ్ గెలిచినందుకు సంబరాలు చేసుకోండి. కానీ అతి చేయవద్దని మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నాడు.
  Published by:John Naveen Kora
  First published: