HOME »NEWS »SPORTS »pakistan pm imran khans lookalike young man spotted in sialkot video of doppelanger goes viral srd

Imran Khan : రిక్షాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మీ కళ్లు మోసం చేయడం గ్యారంటీ.. వైరల్ వీడియో

Imran Khan : రిక్షాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మీ కళ్లు మోసం చేయడం గ్యారంటీ.. వైరల్ వీడియో
ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

Imran Khan : మనుషులను పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. ఇలా ఒకే పోలికలు ఉన్న మనుషులు కన్పిస్తే కాస్త ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తాం కూడా. సామాన్యులు ఒకే పోలికలతో ఉంటే పెద్ద విషయం కాదు. కానీ.. ఓ దేశ ప్రధానిని పోలిన వ్యక్తి జనాల మధ్యలో తిరిగితే..

  • Share this:
    మనుషులను పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. ఇలా ఒకే పోలికలు ఉన్న మనుషులు కన్పిస్తే కాస్త ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తాం కూడా. సామాన్యులు ఒకే పోలికలతో ఉంటే పెద్ద విషయం కాదు. కానీ.. ఓ దేశ ప్రధానిని పోలిన వ్యక్తి జనాల మధ్యలో తిరిగితే.. అవాక్కవాల్సిందే. అలాంటి వ్యక్తిపైన అందరూ దృష్టి పెడతారు. ఇప్పుడు ఈ సుత్తి ఎందుకు చెబుతున్నారా అనుకుంటున్నారా..తాజాగా పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలిన ఓ వ్యక్తి తెర మీదకు వచ్చాడు. అతడిని సడెన్‌గా చూస్తూ.. యువకుడగా ఉన్నప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఎలా ఉండేవారో.. సదరు వ్యక్తి అలానే ఉన్నాడు. సియాల్‌ కోటలో ఆటో రిక్షాలో ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. సియోల్‌కోట్‌లో ఓ యువకుడు రిక్షాలో ప్రయాణిస్తుండగం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాగ ఉన్న యువకుడు రిక్షాలో ప్రయాణిస్తున్నాడు చూడండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    ఇమ్రాన్‌ ఖాన్‌ యువకుడిగా ఉండి దేశం కోసం క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు వైరలవుతోన్న వీడియోలో ఉన్న ఈ కుర్రాడు కూడా సేమ్‌ అలానే ఉన్నాడు. యంగ్‌ ఇమ్రాన్‌ని మరోసారి చూసినట్లు ఉంది.. మా కళ్లని మేం నమ్మలేకపోయాం అంటూ కామెంట్‌ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.










    అయితే, ఇటీవల ఐసీసీ నిర్వహించిన పోల్ లో ఏకంగా విరాట్ కోహ్లీనే వెనక్కి నెట్టి.. పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచారు. కెప్టెన్లు అయిన తర్వాత తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్న ఆటగాళ్లు ఎవరంటూ ఐసీసీ ఇటీవల ట్విటర్లో ఓటింగ్ నిర్వహించింది. కోహ్లీ, ఇమ్రాన్, ఏబీ డివిలియర్స్, మెగ్ లాన్నింగ్‌లలో ఎవరిని ఎన్నుకుంటారంటూ నిర్వహించిన ఈ పోలింగ్‌లో మొత్తం 536,346 ఓట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఇమ్రాన్, కోహ్లీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇమ్రాన్‌కు 47.3 శాతం ఓట్లు రాగా... కోహ్లీకి 46.2 శాతం ఓట్లు వచ్చాయి.
    Published by:Sridhar Reddy
    First published:January 21, 2021, 18:05 IST