కాశ్మీర్‌పై ప్రశ్నిస్తే... పాకిస్థాన్ క్రికెట్ కోచ్ మిస్బా ఉల్ హక్ సమాధానం ఇదీ...

కాశ్మీర్‌పై ప్రశ్నిస్తే... పాకిస్థాన్ క్రికెట్ కోచ్ మిస్బా ఉల్ హక్ సమాధానం ఏంటి (Credit - Twitter - Saj Sadiq)

Misbah-ul-Haq : కాశ్మీర్ అంశంపై అభిప్రాయం అడిగితే చాలు... సైలెంటైపోతున్నాడు మిస్బా ఉల్హక్... తనకు కోచ్ పదవి ఇవ్వడానికి మేజిక్ ఏమీ జరగలేదన్న మిస్బా... గత కోచ్‌కి ఎంత పే చేశారో తనకూ అంతే పే చెయ్యమని కోరానని తెలిపాడు.

  • Share this:
రాజకీయ పార్టీలు, నేతలు... వివాదాస్పద అంశాలపై రకరకాల కామెంట్లు చేస్తుంటారు. తమ కామెంట్లతో ప్రజలను రెచ్చగొట్టి... ఓట్లు కూడా సాధించుకుంటారు. కానీ... ఆటలే తప్ప మరో ప్రపంచం తెలియని క్రీడాకారులను... వివాదాస్పద అంశాలపై ప్రశ్నిస్తే... వాళ్లు సమాధానం చెప్పేందుకు తడబడతారు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కి హెచ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ అయిన మిస్బా ఉల్ హక్ కూడా కాశ్మీర్‌పై ప్రశ్నించేసరికి కంగారుపడ్డాడు. శ్రీలంకతో ODI సిరీస్‌కి ముందు... అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. తన శాలరీ, ఇతరత్రా విశేషాలు చెప్పాడు. తాను పాక్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి కండీషన్లూ పెట్టలేదనీ, గత కోచ్‌ మిక్కీ ఆర్థర్‌కి ఎంత శాలరీ ఇచ్చారో, తనకూ అంతే ఇమ్మని కోరానని తెలిపాడు.

రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న సమయంలో... ఓ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేందుకు మాత్రం మిస్బా సైలెంట్ అయిపోయాడు. పుల్వామా ఎటాక్ తర్వాత... దాన్ని ఖండిస్తూ... ఇండియా టీమ్... ఆర్మీ క్యాప్స్ ధరించింది. కాశ్మీర్ అంశం విషయంలో పాకిస్థాన్ టీమ్ కూడా అలాంటిదేదైనా చేస్తుందా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించేసరికి మిస్బాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఐతే... మిస్బా తెలివిగా సమాధానం చెప్పాడు. క్రికెట్‌కి సంబంధించిన అంశాలపై మాత్రమే ప్రశ్నలు అడగాలని కోరాడు. కింది వీడియోలో సీన్ అదే.


తాను ప్రస్తుత జాబ్ సంపాదించుకోవడానికి ఎలాంటి మ్యాజిక్‌లూ చెయ్యలేదన్నాడు మిస్బా. ఐతే... గత కోచ్ ఎంత శాలరీ తీసుకున్నారన్నది మిస్బా బయటపెట్టలేదు. ఐతే... మిస్బా నెలకు రూ.28 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తం మూడేళ్ల కాలానికి అతడు రూ.3.4 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. ప్రపంచంలోని చాలా మంది కోచ్‌లతో పోల్చితే... అది ఎక్కువే అనిపిస్తున్నా... టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రితో పోల్చితే అది చాలా తక్కువే. రవిశాస్త్రి ఏడాదికి రూ.10 కోట్ల దాకా తీసుకుంటున్నట్లు సమాచారం.
First published: