ICC World Cup 2019 | భారత్‌ చేతిలో ఓడిపోయాక సూసైడ్ చేసుకోవాలనుకున్నా...పాకిస్థాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు...

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి తనను బాగా కలిచివేసిందని, దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు మికీ ఆర్థర్ తెలిపారు.

news18-telugu
Updated: June 25, 2019, 4:06 PM IST
ICC World Cup 2019 | భారత్‌ చేతిలో ఓడిపోయాక సూసైడ్ చేసుకోవాలనుకున్నా...పాకిస్థాన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు...
పాకిస్థాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్..
  • Share this:
పాకిస్థాన్ హెడ్ కోచ్ మికీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి తనను బాగా కలిచివేసిందని, దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు మికీ ఆర్థర్ తెలిపారు. ఇదిలా ఉంటే జూన్ 16న మాంచెస్టర్ లో జరిగిన భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే  పాకిస్థాన్ ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ తో సహా, ఇతర టీమ్ సభ్యులు, మేనేజ్ మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీంతో కలత చెందిన పాకిస్థాన్ కోచ్ మికీ ఆర్థర్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపి సంచలనానికి తెరలేపారు. అలాగే సౌతాఫ్రికాపై పాకిస్థాన్ విజయం తనలో తిరిగి ఆశలు రేపిందని, ఆటగాళ్ల సమిష్టి కృషి వల్లే విజయం సాధించామని మికీ ఆర్థర్ తెలిపాడు.

ఇదిలా ఉంటే, పాకిస్థాన్ ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ఆరు మ్యాచ్ లు ఆడగా, అందులో 2 విజయాలు, 3 అపజయాలు నమోదయ్యాయి. ఒక మ్యాచ్ వర్షార్పణమైన టైగా ముగిసింది. దీంతో పాకిస్థాన్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7 స్థానంలో నిలిచింది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్థాన్ సెమీస్ కు చేరే అవకాశం లేదు. టోర్నీలో పాకిస్థాన్‌కు ఆడేందుకు ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగా, అవి న్యూజిలాండ్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ లతో పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ లు నెగ్గినప్పటికీ పాకిస్థాన్ సెమీస్ కు చేరే ఛాన్స్ దాదాపు లేనట్లే.
Published by: Krishna Adithya
First published: June 25, 2019, 4:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading