హోమ్ /వార్తలు /క్రీడలు /

Pakistan : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంట్లో చోరీ.. బక్రీద్ కోసం తెచ్చిన మేకను..

Pakistan : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంట్లో చోరీ.. బక్రీద్ కోసం తెచ్చిన మేకను..

PC : TWITTER

PC : TWITTER

Pakistan : పాకిస్తాన్ (pakistan) మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ఇంట్లో చోరీ జరిగింది. లాహోర్ (Lahore)లోని తన ఇంటి ఆవరణలోకి గత రాత్రి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు మేకను ఎత్తుకు వెళ్లారు.

Pakistan : పాకిస్తాన్ (pakistan) మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ఇంట్లో చోరీ జరిగింది. లాహోర్ (Lahore)లోని తన ఇంటి ఆవరణలోకి గత రాత్రి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు మేకను ఎత్తుకు వెళ్లారు. ఈ విషయాన్ని కమ్రాన్ అక్మల్ తండ్రి స్వయంగా పేర్కొన్నాడు. బక్రీద్ పండగ కోసం కమ్రాన్ అక్మల్ కుటుంబం 6 మేకలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపాడు. వాటిని ఇంటి ఆవరణలో కట్టేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు అందులోని ఒక మేకను ఎత్తుకెళ్లినట్లు కమ్రాన్ అక్మల్ తండ్రి పేర్కొన్నాడు. ఎత్తుకెళ్లిన మేక ఖరీదు రూ. 90 వేల రూపాయలని ఆయన పేర్కొన్నాడు. దీనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్లు కమ్రాన్ అక్మల్ తండ్రి తెలిపాడు.

ఇది కూడా చదవండి : జర భద్రం కార్తీక్ కాకా.! కొద్దిలో ట్రోల్ తప్పించుకున్నావ్ తెలుసా.! ఏం జరిగిందంటే?

జులై 10వ తేదీన బక్రీద్ పండగను ముస్లింలు ఘనంగా జరుపుకోనున్నారు. భారత్, పాకిస్తాన్ దేశాలతో పాటు ఆరు ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, ఈజిప్ట్, ఒమన్‌ ప్రజలు బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడానికే ముస్లింలు మేకలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో తాము కూడా ఆరు మేకలను కొనుగోలు చేసినట్లు కమ్రాన్ అక్మల్ తండ్రి తెలిపాడు. వాటిని ఇంటి ఆవరణలో కట్టేయగా.. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆయన తెలిపాడు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యదు చేసినట్లు తెలిపాడు. ఆరు మేకల్లోనూ దొంగలు ఎత్తుకెళ్లిన మేకే ఎంతో శ్రేష్టమైనదని ఆయన పేర్కొనడం విశేషం.

ఇక కమ్రాన్ అక్మల్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ టీంలో వికెట్ కీపర్ గా అతడు ఎంట్రీ ఇచ్చాడు. 53 అంతర్జాతీయ టెస్టులు ఆడిన అతడు 2,648 పరుగులు చేశాడు. ఇక 157 అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించిన అతడు 3,236 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో 58 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 6 మ్యాచ్ లు ఆడి 128 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పేలవ వికెట్ కీపింగ్.. చెత్త బ్యాటింగ్ తో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్ దేశవాళి క్రికెట్ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇతడి తమ్ముడు ఉమ్రాన్ అక్మల్ కూడా పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసినా.. అన్న లాగే పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Pakistan, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు