Salman Butt: 'తమ్ముడు.. చాలా బక్కగా ఉన్నావ్.. కండలు పెంచితే కాని వర్కవుట్ కాదు'.. టీమిండియా క్రికెటర్‌పై పాక్ క్రికెటర్ వ్యాఖ్యలు

టీమ్ ఇండియా క్రికెటర్‌పై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచలన వ్యాఖ్యలు (PC: PCB/Twitter)

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ చాలా బక్కగా ఉన్నాడని.. అలాగే ఉంటే గాయాలు పాలవడం సాధారణమే అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ వ్యాఖ్యానించాడు. ఇంతకు ఆ ఆల్‌రౌండర్ ఎవరు?

 • Share this:
  టీమ్ ఇండియా (Team India)  క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెటర్లు (Pakistan Cricketers) నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. రెండు దాయాదీ దేశాల మధ్య కేవలం ఐసీసీ (ICC) ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ (2019 Oneday World Cup) తర్వాత యూఏఈలో ఈ ఏడాది అక్టోబర్ 24న టీ20 వరల్డ్ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అభిమానులు ఎవరు మ్యాచ్ గెలుస్తారనే దానిపై సోషల్ మీడియా వేదికగా వాదోపవాదాలు చేసుకుంటున్నారు. మాజీ క్రికెటర్లు కూడా అక్టోబర్ 24న జరుగనున్న సమరానికి సలహాలు ఇస్తున్నారు. అయితే పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఒకడుగు ముందుకు వేసి టీమ్ ఇండియాలోని ఒక క్రికెటర్‌పై వ్యాఖ్యలు చేశారు. అయితే అవి వ్యతిరేక వ్యాఖ్యలు కావు. అతడు టీమ్ ఇండియాకు మరింత ప్రభావవంతంగా సహాయం చేయడానికి ఏమి చేయాలని సలహా ఇస్తున్నాడు. టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను దృష్టిలో పెట్టుకొని 'భాయ్.. నువ్వు కొంచెం కండలు పెంచితే మంచిది.. అని నీ క్రికెట్ కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది' అని భట్ చెప్పాడు. హార్దిక్ పాండ్యా చాలా బక్కగా ఉండటం వల్ల అతడు తరచూ గాయాల బారిన పడుతున్నాడని సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. ఒక ఆల్‌రౌండర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయాలి.. కానీ హార్దిక్ పాండ్యా మజిల్స్ అందుకు సహకరించక పోవడంతో అతడి వెన్నెముకపై భారం పడి గాయపడుతున్నాడు. అతను కనుక కండలు కాస్త పెంచితే మరింత వేగంగా బౌలింగ్ చేయగలడు అని సల్మాన్ బట్ అన్నాడు.

  'భారత జట్టు గత కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది. కానీ అతడు చాలా కాలం టీమ్‌కు దూరమయ్యాడు. తిరిగి జట్టులో చేరినా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. దీంతో అతడిని దాటేసి అనేక మంది యువ క్రికెటర్లు జట్టులో ముందుకు వెళ్తున్నారు' అని సల్మాన్ అన్నాడు. హార్దిక్ పాండ్యా వెన్నెముక సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం లేదు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఉపయోగపడతాడని భావించినా ప్రస్తుతం పాండ్యా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అవుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి సర్జరీ తర్వాత అడుగుపెట్టిన పాండ్యా.. బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అతడి పరిస్థితిపై మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా వ్యాఖ్యానించాడు. కేవలం బ్యాటింగ్ చేయడానికి అయితే అనేక మంది యువ క్రికెటర్లు బెంచ్‌పై సిద్దంగా ఉన్నారని.. పాండ్యా బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని కపిల్ సూచించాడు. కపిల్, ఇమ్రాన్ ఖాన్ వంటి ఆల్‌రౌండర్లు స్ట్రాంగ్ బాడీ హార్దిక్‌కు ఎందుకు ఉండాలో గతంలోనే సూచించారు. అయినా అతడు మాత్రం మారలేదు. ఇప్పటికైనా తన శరీర ధృఢత్వంపై హార్దిక్ దృష్టి పెట్టాలని హార్దిక్ పాండ్యా అన్నాడు.

  Taliban Supports Cricket: క్రికెట్‌కు తాలిబన్ల మద్దతు ఎందుకు? వరల్డ్ కప్‌లో ఓడిపోతే అఫ్గాన్ క్రికెటర్ల పరిస్థితి ఏంటి?
   హార్దిక్ పాండ్యా యూట్యూబ్‌లో ఉన్న కపిల్, ఇమ్రాన్ ఖాన్ వీడియోలు చూసి శరీరాన్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలని భట్ సూచించాడు. టీమ్ ఇండియా లేదా హార్దిక్ వ్యక్తిగత ఫిజియో, ట్రైనర్లు ఈ విషయంలో అతడికి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పాడు. ఏదేమైనా టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా ఎదుర్కుంటున్న విమర్శలకు అనేక మంది సలహాలు ఇస్తున్నారు. అయినా పాండ్యా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మాత్రం కనపడటం లేదు. త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్‌ 2021 రెండో దశలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాల్సి ఉన్నది. మరి అప్పటి లోగా అతడు ఫిట్‌నెస్ ఎలా పెంచుకుంటాడో వేచి చూడాలి.
  Published by:John Naveen Kora
  First published: