పాక్‌ అభిమాని తిట్టాడు... వీడియో రికార్డు చేయడంతో మిన్నకుండిపోయాం: విజయ్‌

Rekulapally Saichand
Updated: June 26, 2020, 4:10 PM IST
పాక్‌ అభిమాని తిట్టాడు... వీడియో రికార్డు చేయడంతో మిన్నకుండిపోయాం: విజయ్‌
విజయ్ శంకర్
  • Share this:
టీమ్‌ఇండియా క్రికెటర్‌ విజయ్‌ శంకర్‌ గతేడాది వన్డే ప్రపంచకప్‌‌ సమయంలో తనకు జరిగిన ఓ అవమానాన్ని తాజాగా బయటపెట్టారు. పాకిస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌కు ముందు రోజు ఆ దేశానికి చెందిన ఓ అభిమాని తమని విపరీతంగా దూషించాడని విజయ్‌ శంకర్‌ వెల్లడించాడు. భారత్‌ ఆర్మీ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

"పాక్‌తో జరగబోయే మ్యాచ్‌‌కు ముందురోజు నేను మిగితా ఆటగాళ్లం కలిసి కాఫీ కోసం బయటకు వెళ్లాం. అప్పుడు పాకిస్థాన్‌కు చెందిన ఓ అభిమాని మా దగ్గరకు వచ్చి విపరీతంగా దూషించాడు. అంతేకాకుండా అతను మాపై దుర్భాష‌లాడుతూనే వీడియో రికార్డింగ్‌ చేశాడు.అయినప్పటికి మేము సహనం కోల్పోకుండా మిన్నకుండిపోయామని" అని శంకర్‌ వివరించాడు

మ్యాంచెస్టర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 336/5 భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌శర్మ 140 ,కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 77 పరుగులతో దూకుడుగా ఆడారు. . అనంతరం ఛేదనకు దిగిన పాక్ 40 ఓవర్లకు 212/6 పరుగులు ఉన్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. వాన ఎంతకి విరామం ఇవ్వకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్ 89 పరుగుల తేడాతో గెలుపొందినట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్ 15 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు
First published: June 26, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading