క్రికెట్‌ను చంపేసిన ఐసీసీ... షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం...

గడిచిన దశాబ్దకాలంలో ఐసీసీ క్రికెట్‌ను పాతాళానికి తీసుకెళ్లిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు.

news18-telugu
Updated: May 26, 2020, 7:55 PM IST
క్రికెట్‌ను చంపేసిన ఐసీసీ... షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం...
షోయబ్ అక్తర్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఐసీసీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గడిచిన దశాబ్దకాలంలో ఐసీసీ క్రికెట్‌ను పాతాళానికి తీసుకెళ్లిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. తక్కువ ఓవర్ల ఆటను పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ఛాట్ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్‌తో షోయబ్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓవర్‌కు ఒకటే బౌన్సర్ ఉండాలనే రూల్ మార్చాలని తాను పదే పదే చేసిన ప్రతిపాదనను ఐసీసీ పట్టించుకోలేదని అన్నాడు. గడిచిన పదేళ్ల కాలంలో క్రికెట్ క్రేజ్ పెరిగిందో లేక తగ్గిందో ఐసీసీనే చెప్పాలని వ్యాఖ్యానించాడు.

సచిన్ వర్సెస్ షోయబ్ వంటి ఆట కనిపించకుండా పోయి చాలాకాలం అవుతోందని అక్తర్ కామెంట్ చేశాడు. సచిన్ అంటే తనకు ఎప్పుడూ గౌరవమే అని... అయితే కొన్నిసార్లు తాను సచిన్‌ను కట్టడి చేశానని గుర్తు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో కలిసి ఫాస్ట్ బౌలర్లను తయారు చేసే పనిలో ఉన్నానని అన్నాడు. పాస్ట్ బౌలర్లు చిరుతల్లా ఉండాలని... తాను 12 మంది ఫాస్ట్ బౌలర్లను తయారు చేశానని అన్నాడు.

First published: May 26, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading