హోమ్ /వార్తలు /క్రీడలు /

సానియా మీర్జా భర్త మాలిక్‌కు బిగ్ షాక్.. ఇక ఇండియాకు మకాం మార్చాల్సిందేనా!

సానియా మీర్జా భర్త మాలిక్‌కు బిగ్ షాక్.. ఇక ఇండియాకు మకాం మార్చాల్సిందేనా!

sania and malik

sania and malik

పాకిస్థాన్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో షోయబ్‌ మాలిక్‌కు చోటు దక్కలేదు. అతనితో పాటు మరో సీనియర్ క్రికెటర్ పేసర్‌ మొహమ్మద్‌ అమీర్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు.

ఇంకా చదవండి ...

  పాకిస్థాన్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో షోయబ్‌ మాలిక్‌కు చోటు దక్కలేదు. అతనితో పాటు మరో సీనియర్ క్రికెటర్ పేసర్‌ మొహమ్మద్‌ అమీర్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. తాజాగా జరిగిన జింబాబ్వే టూర్‌కు సైతం అతన్ని పక్కన పెట్టారు. ఈ పర్యటన కోసం 20 మంది సభ్యుల సహాయక సిబ్బందితో పాటు పాక్ టీం నవంబర్ 23 న లింకన్ బయలుదేరుతుంది. అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ ఉంటారు. పాక్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య డిసెంబర్‌ 18, 20, 22 తేదీల్లో 3 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మౌంట్‌ మాంగనీ (డిసెంబర్‌ 26–30), క్రైస్ట్‌చర్చ్‌ (జనవరి 3–7) వేదికల్లో రెండు టెస్టులు జరుగుతాయి.

  అయితే అన్ని ఫార్మట్‌లకు గుడ్‌బై చేప్పిన మాలిక్ కేవలం టి20 క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. 38 ఏళ్ల మాలిక్‌ గత పదిహేనేళ్ళుగా పాక్ క్రికెట్‌కు సేవలందిస్తున్నాడు. మాలిక్‌ను ఇలా విస్మరించడంపై అభిమానలు ఫైర్ అవుతున్నారు. కివీస్ పర్యటన కోసం ప్రకటించిన 35 మంది సభ్యుల బృందంలో అతను లేకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)పై  మండిపడుతున్నారు.

  ఈ విషయంపై బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ " షోయబ్ మాలిక్, మహ్మద్ అమీర్ కివీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు, యువతను పోత్సాహించే విధంగా జట్టు కూర్పు జరిగిందని" తెలిపారు.

  షోయబ్‌ మాలిక్  ఇండియన్ టెన్నిస్ స్టార్ ఫ్లేయర్ సానీయా భర్త. పాక్‌స్తాన్ జట్టులో సీనియర్ ఆటగాడి ఉన్న మాలిక్, తన క్రికెట్ కేరిర్‌కు గుడ్ బై చెప్పే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ చెప్పిన తర్వాత భార్య సానియాతో కలిసి ఇండియాలో ఉంటారా లేక పాక్‌లోనే ఉంటారా అనే దానిపై అభిమానులు చర్చికుంటున్నారు. ఈ దంపతులు ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సానీయా హైదరాబాద్‌లోనే ఉంటుంది. షోయబ్ క్రికెట్ విడ్కోలు చెప్పిన తర్వాత అతను ప్రయాణం ఏటు అనేది తెలియాలి. పోమ్మన లేక పొగ పెడుతున్న బోర్డుతో సహాసం చేస్తూ ఇంకా ఎన్నాళ్ళు ఆ టీంలో కొనసాగుతాడో చూడాలి.


  పాకిస్తాన్ vs న్యూజిలాండ్ పూర్తి షెడ్యూల్

  18 డిసెంబర్ - మెుదటి టి 20 ఐ, ఈడెన్ పార్క్, ఆక్లాండ్

  20 డిసెంబర్ - రెండో టీ 20 సెడ్డాన్ పార్క్, హామిల్టన్

  22 డిసెంబర్ - మూడో టీ 20 మెక్లీన్ పార్క్, నేపియర్

  26-30 డిసెంబర్ - మెుదటి టెస్ట్, బే ఓవల్, మౌంగనుయ్

  3-7 జనవరి - 2 వ టెస్ట్, హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Pakistan

  ఉత్తమ కథలు