Home /News /sports /

PAKISTAN CRICKETER SHOAIB MALIK CAR RAMS INTO TRUCK IN LAHORE SA

shoaib malik: సానియా భర్త షోయబ్‌ మాలిక్‌ కారుకు యాక్సిడెంట్‌ (video)

shoaib-malik-survives-car-accident

shoaib-malik-survives-car-accident

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త,పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురిక్షితంగా బయటపడ్డారు. ఆయన నడుపుతున్న స్పోర్ట్స్‌ కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది.



    భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త,పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురిక్షితంగా బయటపడ్డారు. ఆయన నడుపుతున్న స్పోర్ట్స్‌ కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. లాహోర్‌లో జాతీయ రహదారికి సమీపంలోని ఓ రెస్టారెంటు వద్ద
    ఈ ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)- 2021 టీర్నీ కోసం జరుగుతున్న సన్నాహకాల్లో పాల్గోన్నా మాలిక్ ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది, ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రమాదానికి కారణం మాలిక్ అతి వేగమే అని ప్రాథమికంగా నిర్ధారించారు.











    ఇక యాక్సిడెంట్‌లో మాలిక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అతను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. నా కారుకు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నుంచి సురిక్షితంగా బయటపడ్డాను. భగవంతుడి దయ వల్ల నాకు ఏమి కాలేదు. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు ’’ అని షోయబ్‌ ట్వీట్‌ చేశారు. షోయాబ్‌కు ప్రమాదం జరిగిందని తెలిసి వెంటనే భర్తకు ఫోన్ చేసిన సానీయా అతని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ఏప్రిల్‌ 12, 2008న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Shoaib Malik

    తదుపరి వార్తలు