క్రికెట్‌ను (Cricket) కెరీర్‌గా ఎంచుకున్న ఆ వ్యక్తి 18 ఏళ్ల పాటు ఫ్టస్ క్లాస్ (First Class) క్రికెట్ ఆడాడు. 18 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్ (Domestic Cricket) ఆడటం మొదలు పెట్టిన ఆ క్రికెటర్.. తొలి టెస్టు ఆడటానికి దాదాపు రెండు దశాబ్దాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగని అతడు టాలెంట్ లేని, సరైనా రికార్డులు లేని క్రికెటర్ కాదు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన బౌలర్‌గా నిరూపించుకున్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం ఏనాడూ అతడిపై కరుణ చూపలేదు. ఇండియాలో ఒకటి రెండు సీజన్లు దేశవాళీలో రాణిస్తే జాతీయ జట్టులో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా, పాండ్యా వంటి క్రికెటర్లు ఐపీఎల్లో ప్రతిభ ద్వారా టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. కానీ పాకిస్తాన్‌కు చెందిన తబిష్ ఖాన్‌కు (Tabish Khan) ఆ అదృష్టం లేదు. తన తొలి టెస్టు మ్యాచ్ ఆడటానికి 18 ఏళ్ల పాటు వెయిట్ చేశాడు. ఎట్టకేలకు జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో అరంగేట్రం చేసి తొలి టెస్టు తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో (Test MAtch) అత్యధిక వయసులో అరంగేట్రం చేసి తొలి ఓవర్లోనే వికెట్ తీసి 70 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్తాన్‌లోని కరాచిలో 1984 డిసెంబర్ 12న తబిష్ ఖాన్ జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్న తబిష్.. తన 18వ ఏట దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. సింధ్, కరాచీ కింగ్స్, కరాచీ వైట్స్, పాకిస్తాన్ టెలివిజన్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
18 ఏళ్ల దేశవాళీ కెరీర్లో 598 ఫస్ట్ క్లాస్ వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన టెస్టులో తీసిన వికెట్ అతడికి 599వ ఫస్ట్ క్లాస్ వికెట్. కాగా, టెస్టుల్లో అరంగేట్రం చేయక ముందు దేశవాళీ క్రికెట్లో అత్యధిక వికెట్లు (598) తీసిన ఏసియస్ క్రికెటర్‌గా తబీష్ రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా అత్యధిక వయసులో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్‌లోనే వికెట్ తీసి 70 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. 1951లో జీడబ్ల్యూ చబ్ అనే సౌతాఫ్రికా బౌలర్ ఇంగ్లాండ్‌పై అత్యధిక వయసులో అరంగేట్రం చేసి వికెట్ తీశాడు.
Tabish Khan Will TodaY Bowl For PakisTan After Decades Of Hard Work ...
He Bowled His 2️⃣7️⃣6️⃣0️⃣8️⃣TH Ball In FC CrickeT TodaY BuT This Time For PakisTan ... ???❤️
5️⃣9️⃣9️⃣TH FC WickeT For Him ? @tabbkhan84 #ZIMvPAK #tabishkhan #IsraeliAttackonAlAqsa #Jerusalem #Pakistan pic.twitter.com/mBwmkUneWg
— احسن طالب?????? (@Ahsantalib12) May 8, 2021
వికెట్ తీసిన వెంటనే తబిష్ ఖాన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఉద్వేగానికి గురైన అతడిని సహచరులు ఓదార్చారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అజర్ అలీ మాట్లాడుతూ.. జాతీయ జట్టులో అవకాశాలు రావట్లేదని అనుకునే క్రికెటర్లకు తబిష్ ఖాన్ ఆదర్శంగా తీసుకోవాలి. 18 ఏళ్ల నుంచి పాకిస్తాన్ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఏనాడూ తన ఆశను వదలకుండా కష్టపడ్డాడు. చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు అని అన్నాడు. తబిష్ ఖాన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.