అయోధ్య రాముడిని దర్శించుకుంటా...పాకిస్థాన్ క్రికెటర్ సంచలన ప్రకటన...

రామ్‌లాలా చూడటానికి తనకు అయోధ్యకు రావాలనే కోరిక ఉందని డానిష్ కనేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలోని రామ్ ఆలయం కోసం ఆగస్టు 5 న పిఎం నరేంద్ర మోడీ భూమి పూజలు నిర్వహించిన సందర్భంగా కనేరియా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 11, 2020, 6:14 PM IST
అయోధ్య రాముడిని దర్శించుకుంటా...పాకిస్థాన్ క్రికెటర్ సంచలన ప్రకటన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్ క్రికెటర్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అయోధ్య రామమందిరం భూమి పూజపై తన సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఆగస్టు 5 చారిత్రాత్మక దినమని ఆయన ప్రకటించారు. రామ్‌లాలా చూడటానికి తనకు అయోధ్యకు రావాలనే కోరిక ఉందని డానిష్ కనేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలోని రామ్ ఆలయం కోసం ఆగస్టు 5 న పిఎం నరేంద్ర మోడీ భూమి పూజలు నిర్వహించిన సందర్భంగా కనేరియా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

డానిష్ కనేరియా


భగవాన్ రాముడి సంకల్పం ఉంటే తాను ఖచ్చితంగా అయోధ్యకు వచ్చి రామ్ లాలాను చూస్తానని కనేరియా తెలిపాడు. ఈ విషయంలో కనేరియా ట్వీట్ చేస్తూ, "అయోధ్య పవిత్ర ప్రదేశమని తనకు అవకాశం వస్తే, ఖచ్చితంగా అయోధ్యకు వస్తాను అని తెలిపారు. అంతేకాదు తాను హిందువునని, రాముడు చూపిన మార్గాన్ని ఎల్లప్పుడూ అనుసరించడానికి ప్రయత్నిస్తానని కనేరియా తెలిపారు. ఖచ్చితంగా అయోధ్యకు వచ్చి రామ్ లాలాను చూస్తానని ఆయన ఒక వార్తా ఛానెల్ కు తెలిపారు.

డానిష్ కనేరియా ట్వీట్‌తో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆయనను ప్రశంసిస్తున్నారు. తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా ఎప్పటికీ శాశ్వతంగా భారతదేశంలో స్థిరపడటానికి కనేరియాను ఆహ్వానించడం కొసమెరుపు. మరికొంతఅప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. బహిరంగంగా ఇలా ట్వీట్ చేసిన తరువాత, పాకిస్తాన్‌లో వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
Published by: Krishna Adithya
First published: August 11, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading