హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : పాకిస్తాన్ పుచ్చకాయ జెర్సీపై ట్రోల్.. సెంటర్ ఫ్రూట్ యాడ్ కాపీ అంటూ కామెంట్స్

IND vs AUS : పాకిస్తాన్ పుచ్చకాయ జెర్సీపై ట్రోల్.. సెంటర్ ఫ్రూట్ యాడ్ కాపీ అంటూ కామెంట్స్

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 1st T20: టి20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం అందులో పాల్గొనే జట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా తమ కొత్త జెర్సీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ (Pakistan) టి20 ప్రపంచకప్ జెర్సీ ఫోటోలు లీక్ అయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 1st T20: టి20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం అందులో పాల్గొనే జట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా తమ కొత్త జెర్సీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ (Pakistan) టి20 ప్రపంచకప్ జెర్సీ ఫోటోలు లీక్ అయ్యాయి. బాబర్ ఆజమ్ (Babar Azam) ఈ కొత్త జెర్సీతో ఫోటో షూట్ లో పాల్గొనగా.. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఇక ఈ జెర్సీని చూసిన తర్వాత క్రికెట్ లవర్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)ను ఒక ఆట ఆడుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్.. ముదురు ఆకుపచ్చ లేదంటే లైట్ గ్రీన్ కలర్స్ జెర్సీతో క్రికెట్ ఆడుతోంది. తాజాగా ఈ రెండిటి కలర్స్ ను మిక్స్ చేస్తూ కొత్త జెర్సీని డిజైన్ చేసింది. అది కాస్తా పుచ్చకాయ కలర్స్ ను తలపించేలా ఉండటంతో ఫ్యాన్స్ పీసీబీపై విరుచుకుపడుతున్నారు.

పాకిస్తాన్ జెర్సీ విషయానికి వస్తే ఎక్కువ భాగం గ్రీన్ కలర్ తోనే ఉంది. అయితే మధ్య మధ్యలో లైట్ గ్రీన్  ను యాడ్ చేశారు. దాంతో అది కాస్తా.. పుచ్చకాయను తలపించేలా తయారైంది. అంతేకాకుండా సెంటర్ ఫ్రూట్ మింగిల్ చాక్లెట్ కవర్ ను తలపించేలా ఉందంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత్ జెర్సీని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు.

ఇక ఆసియా కప్ 2022లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇక టి20 ప్రపంచకప్ ముందు స్వదేశంలో ఇంగ్లండ్ తో 7 మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఇక అక్టోబర్ 23న భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి ప్రపంచకప్ వేదికపై తలపడనున్నాయి. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు తలపడగా అప్పుడు భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గాయంతో ఆసియా కప్ కు దూరమైన షాహీన్ అఫ్రిది కోలుకోవడంతో అతడు మళ్లీ పాకిస్తాన్ జట్టులోకి వచ్చాడు. టి20 ప్రపంచకప్ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు.

పాకిస్తాన్ టి20 ప్రపంచకప్ జట్టు

బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికర్, ఖుష్దిల్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, షాహీన్ అఫ్రిది,  మసూద్, ఉస్మాన్ ఖాదిర్

స్టాండ్ బై

దహాని, ఫఖర్ జమాన్, హ్యారీస్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Babar Azam, Hardik Pandya, IND vs PAK, India vs australia, India VS Pakistan, Jasprit Bumrah, KL Rahul, Mohammed Shami, Pakistan, Rishabh Pant, Rohit sharma, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు