PAKISTAN CRICKET NEWS PAKISTAN FORMER LEG SPINNER DANISH KANERIA SAYS SHAHID AFRIDI WAS A CHARECTERLESS AND LIAR SJN
Danish Kaneria : ’అఫ్రిది ఒక అబద్ధాల కోరు.. నేను హిందువునని ద్వేషించేవాడు‘ సంచలన కామెంట్స్ చేసిన పాక్ మాజీ స్పిన్నర్
షాహిద్ అఫ్రిది (ఫైల్ ఫోటో)
Danish Kaneria : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (shahid afridi)పై ఆ జట్టు మాజీ లెగ్ స్పినర్ డానిష్ కనేరియా (danish kaneria) సంచలన కామెంట్స్ చేశాడు. డానిష్ కనేరియా 2000 నుంచి 2010 మధ్య పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే తాను పాకిస్తాన్ కు ఆడే సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తాజాగా వివరించే ప్రయత్నం చేశాడు.
Danish Kaneria : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (shahid afridi)పై ఆ జట్టు మాజీ లెగ్ స్పినర్ డానిష్ కనేరియా (danish kaneria) సంచలన కామెంట్స్ చేశాడు. డానిష్ కనేరియా 2000 నుంచి 2010 మధ్య పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే తాను పాకిస్తాన్ కు ఆడే సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తాజాగా వివరించే ప్రయత్నం చేశాడు. తనను మతం పేరు మీద జట్టులోని ఓ సీనియర్ ఆటగాడు ఎలా వేధించేవాడో.. తనను జట్టు నుంచి వెళ్లగొట్టేందుకు ఏ విధంగా కుట్రలు చేశాడో అనే అంశాలపై మాట్లాడిన డానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ (Pakistan) లో చిన్నపాటి అలజడినే సృష్టించాడు. ఈ సందర్భంగా 41 ఏళ్ల కనేరియా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఐఏఎన్ఎస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన కనేరియా.. అఫ్రిదికి క్యారెక్టర్ లేదని పేర్కొన్నాడు. అంతేకాకుండా పెద్ద అబద్ధాల కోరంటూ సంచలన కామెంట్స్ చేశాడు. తనను జట్టులో నుంచి బయటకు పంపేందుకు కుట్రలు పన్నేవాడని కూడా ఆరోపించాడు. అంతేకాకుండా తాను హిందూవుననే కోపం అతడిలో ఎక్కువగా ఉండేదని కనేరియా తెలిపాడు. ’పాకిస్తాన్ కు నేను ప్రాతినిధ్యం వహించినంత కాలం నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. తోటి ఆటగాళ్ల ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ హేళన చేసేవాడు. అతడు కెప్టెన్ అయ్యాక నన్ను కావాలనే బెంచ్ కు పరిమితం చేసేవాడు. దాంతో చాలా వన్డేల్లో ఆడలేకపోయాను. అంతేకాదు నేను హిందువునంటూ.. ఈ దేశంలో అతనికి చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడ‘ని కనేరియా అఫ్రిదిపై కామెంట్స్ చేశాడు.
డానిష్ కనేరియాను జట్టు సభ్యులు సరిగ్గా చూసేవాళ్లు కాదని తొలిసారి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై స్పందించిన కనేరియా.. అక్తర్ కు థ్యాంక్స్ చెప్పాడు. తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాట్లాడిన తొలి వ్యక్తి షోయబ్ అక్తర్. అయితే తన గురించి మాట్లాడకుండా అతడిపై ఒత్తడి తెచ్చి అక్తర్ నోరు మూపించారని కనేరియా పేర్కొన్నాడు. తాను అఫ్రిది చేతిలో దారుణ అవమానాలకు గురయ్యానని కనేరియా పదే పదే చెప్పుకొచ్చాడు.
2009లో ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతుండగా కనేరియాపై స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. కాగా తనపై విధించిన జీవతకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పీసీబీకి మొరపెట్టుకున్నాడు. ఫిక్సింగ్ చేసిన వారు చాలా మంది మళ్లీ పాకిస్తాన్ జట్టులో పునరాగమనం చేశారని.. తనపై ఉన్న నిషేధం ఎత్తి వేస్తే ప్రైవేట్ లీగ్ ల్లో తన మానాన తాను ఆడుకుంటానని కనేరియా పీసీబీకి విజ్ఞప్తి చేశాడు. కనేరియా 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.