వరల్డ్ కప్ మ్యాచ్‌లో బలూచిస్తాన్ పోస్టర్లు... చించేసిన పాకిస్థాన్ ఫ్యాన్స్

Pakistan vs South Africa Match : బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఇప్పటికీ అది నెరవేరట్లేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 11:40 AM IST
వరల్డ్ కప్ మ్యాచ్‌లో బలూచిస్తాన్ పోస్టర్లు... చించేసిన పాకిస్థాన్ ఫ్యాన్స్
బలూచిస్థాన్ పోస్టర్లు చించేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్
  • Share this:
ఆదివారం పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు... స్టేడియం బయట బలూచిస్తాన్ పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ ఆధిపత్యంలో ఉన్న బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ... బలూచిస్థాన్ ప్రజలు పోస్టర్లు ప్రదర్శించారు. అదే సమయంలో... అక్కడే ఉన్న పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆ పోస్టర్లను చించివేశారు. ఈ క్రమంలో రెండువర్గాల మధ్యా వాగ్వాదం జరిగింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బయట ఈ ఘటన జరిగింది. బలూచిస్థాన్ ప్రజలపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపుతోందనీ, అరాచకాలకు పాల్పడుతోందని బలూచిస్థాన్ బాధితులు తమ పోస్టర్లలో తెలిపారు. ఈ పోస్టర్లను చించేసినప్పటికీ... పాకిస్థాన్‌పై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఏర్పడింది.

తమపై పాకిస్థాన్ ఆధిపత్య ధోరణిని ఖండించేందుకు బలూచిస్థాన్ ప్రజలు వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తున్నారు. తాజాగా లండన్‌లోనూ అదే చేశారు. పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఈ పోస్టర్లను చించేసినప్పటికీ... ఈ అంశం అప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

2017లో కూడా లండన్‌లోని బస్సులు, టాక్సీల్లో ఇలాంటి పోస్టర్లు కనిపించాయి. అప్పట్లో వీటిపై పాకిస్తాన్ అభ్యంతరం తెలిపింది. ఐక్యరాజ్యసమితి భవనాల ముందు కూడా ఇలాంటి ప్రదర్శనలు జరిగాయి. ఎంత చేసినా బలూచిస్థాన్ విషయంలో మాత్రం పాకిస్థాన్ తన తీరు మార్చుకోవట్లేదు. అక్కడి ప్రజల అభివృద్ధికి ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. ఫలితంగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.

 

Video : వరల్డ్ కప్ మ్యాచ్‌లో బలూచిస్తాన్ పోస్టర్లు... చించేసిన పాకిస్థాన్ ఫ్యాన్స్

First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading