PAKISTAN CRICKET BOARD CHAIRMAN RAMIZ RAJA HAS ONCE AGAIN ADVOCATED FOR THE RESUMPTION OF THE INDIA PAKISTAN BILATERAL SERIES GH SRD
India Vs Pakistan: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారత్, పాక్ సిరీస్ .. ఐసీసీ ముందు కీలక ప్రతిపాదన..
Ind Vs Pak (Twitter)
India Vs Pakistan:భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఐసీసీ టోర్నీల్లో తప్ప.. ఈ రెండు జట్లు హెడ్ టు హెడ్ ఫైట్ చేసింది లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
భారత్, పాకిస్థాన్ (India Vs Pakistan) మధ్య క్రికెట్ (Cricket) పోటీ అంటే అది ఒక భీకర సమరం. స్టేడియంలు నిండిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఏ మ్యాచ్‌కు కూడా ఉండని ఆదరణ ఈ రెండు టీమ్‌లు ఆడే ఆటకు ఉంటుంది. క్రికెట్లో రెండు దేశాలు సమఉజ్జీలుగా ఉండటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. కాని, రెండు దేశాల మధ్య ఏర్పడిన సైనిక, రాజకీయ ప్రతిష్ఠంభన కారణంగా ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను గత కొంతకాలంగా ఆస్వాదించలేకపోతున్నారు.కాని ఆ పరిస్థితిని మార్చేందుకు పాకిస్థాన్తరపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ తిరిగి ప్రారంభం కావాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) మరోసారి ఆకాంక్షించారు. ఉపఖండంలోని రెండు భీకర ప్రత్యర్థులు ముఖాముఖి తలపడితే ప్రపంచమంతా స్థంభించిపోతుందని రాజా అబిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ క్రికెట్బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండు దేశాల మధ్య పోటీ జరగాలని రాజా కోరుకుంటున్నారు. భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ను కలుపుకొని నాలుగు దేశాల T20I నిర్వహిస్తే బాగుంటుందని ఈ మధ్యే ఆయన కొత్త ప్రతిపాదన చేశారు. ఈ ఆలోచనకు భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయాలు అడ్డంకులను పక్కన పెట్టిమేము ముందుకు వెళ్లాలనుకుంటున్నామని రమీజ్ రాజా సమాధానమిచ్చారు.
రమీజ్ రాజా
“T20 వల్డ్ కప్‌లో పాకిస్థాన్, భారత్ ఆడితే ప్రపంచమంతా ఆగి చూస్తుంది. అది కనువిందు చేస్తుంది. అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది మనం చూడాలి.ఏది సరైనదే అది మనం చేయాలి. దీని గుర్తించి మనం మాట్లాడుకోవాలి. ఈ విషయంలో చర్చ జరగాల్సి ఉంది. దీన్ని నేను ఐసీసీ ముందుంచుతాను, చూద్దాం ఏం జరుగుతుందో” అని రాజా అన్నారు.
గంగూలీ మదిలో ఏముంది?
బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సౌరవ్ గంగూలీ కూడా ఇలాంటి ఆలోచనే చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో సూపర్ నిర్వహించాలని, అందులో నాలుగో టీమ్ రోటేటింగ్ భాగస్వామి ఉండాలని ఆయన ప్రతిపాదించారు. గంగూలీ ఆలోచన గురించి తనకు తెలియదని, కాని, ICC- ఆఫీస్ బేరర్ల సమావేశంలో తన ప్రతిపాదన చెప్పేందుకు ఆసక్తిగా ఉన్నానని రాజా అన్నారు.
ఈ ఆలోచన ఆకర్షణీయంగానే కనిపిస్తున్నా అది సాకారం కావాలంటే ఎన్నో అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుంది. ఆట కోసం అడ్డంకులను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని రమీజ్ రాజా అంటున్నారు.
“నాలుగు దేశాల సూపర్ సిరీస్ నిర్వహణ కోసం ఒక ప్రత్యేక CEO నేతృత్వంలో కొత్త లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఆదాయ సమీకరణ, పంపిణీ కోసం ఒక కొత్త స్వరూపం ఉండాలి. ఐసీసీ బోర్డుల మధ్య దఫాల వారీగా ఆదాయం/డబ్బు పంపిణీ జరగాలి. దీని కోసం ప్రత్యేకంగా FTP విండో ఏర్పాటు చేయాలి” అని రమీజ్ రాజా అన్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.