హోమ్ /వార్తలు /క్రీడలు /

Pakistan Cricket Captain Babar Azam బండారం బట్టబయలు.. గర్ల్‌ఫ్రెండ్ సంచలన ఆరోపణలు.. అలా చేశాడంటూ..

Pakistan Cricket Captain Babar Azam బండారం బట్టబయలు.. గర్ల్‌ఫ్రెండ్ సంచలన ఆరోపణలు.. అలా చేశాడంటూ..

బాబర్ ఆజమ్, హమీదా (ఫైల్ ఫోటో)

బాబర్ ఆజమ్, హమీదా (ఫైల్ ఫోటో)

Complaint On Babar Azam: తన దగ్గర నుంచి అంత డబ్బు వచ్చినప్పటికీ బాబర్ ఆజమ్ సంతోషంగా లేడని ఆరోపించింది. ప్రతి రోజు తనతో గొడవ పడేవాడని తెలిపింది. దీంతో అతడిపై పోలీసులకు హమీదా ఫిర్యాదు చేసింది.

  టి20 ప్రపంచకప్‌లో ఇండియాపై మ్యాచ్ గెలిచిన తరువాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వార్తల్లో నిలిచాడు. పాక్‌లోని క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతడిని ఒక ఐకాన్‌గా అభివర్ణిస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో బాబర్ ఆజమ్ (Babar Azam) చుట్టూ పలు వివాదాలు ఉన్నాయి. బాబర్ ఆజమ్ స్నేహితురాలిగా చెప్పుకునే హమీదా ముక్తర్.. ఆజమ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకుని వదిలేశాడని ఆరోపించింది. అంతేకాదు తాను బాబర్ ఆజమ్ కారణంగా ఓ తల్లిని కాబోతున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి కోర్టులో హమీదా కేసు కూడా వేసింది. ఈ విషయాన్ని కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు బాబర్ ఆజమ్ కుటుంబం తనకు రూ. 20 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిందని తెలిపింది. ఈ వ్యవహారం లాహోర్ (Lahore)  హైకోర్టుకు వెళ్లిన తరువాత ఈ ప్రతిపాదన బాబర్ ఆజమ్ నుంచి వచ్చిందని వెల్లడించింది.

  తాను బాబర్ ఆజమ్ కలిసి చదువుకున్నట్టు హమీదా తెలిపింది. డైలీ పాకిస్థాన్(Pakistan) కథనం ప్రకారం బాబర్ ఆజమ్ తనను లైంగిక వేధించడంతో పాటు ఆర్థికంగా మోసం చేశాడని హమీదా ఆరోపించింది. తాను బాబర్ ఆజమ్ ప్రేమించుకున్నామని.. 2011లో ఇంటి నుంచి పారిపోయామని పేర్కొంది. లాహోర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇద్దరం కలిసి కొన్ని ప్రాంతాల్లో కలిసి ఉన్నామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి అనేక ఆధారాలను చూపించింది. ఖురాన్ చేతిలో పట్టుకుని మరీ ఈ విషయాలను తెలిపింది హమీదా. ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకునేందుకు 2011లో ఇంట్లో నుంచి పారిపోయామని పేర్కొంది.

  బాబర్ ఆజమ్ స్నేహితుల ఇంట్లో తాము కొన్ని రోజులు ఉన్నామని చెప్పింది. బాబర్‌ ఆజమ్‌తో వెళ్లిపోవడానికి ముందు తాను ఇంట్లో నుంచి రూ. 2 లక్షల విలువైన నగలను కూడా దొంగలించానని తెలిపింది. బాబర్ ఆజమ్ కోసం తాను కారును కూడా అమ్మేసి రూ. 12 లక్షలు ఇచ్చామని చెప్పుకొచ్చింది.

  Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

  After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

  తన దగ్గర నుంచి అంత డబ్బు వచ్చినప్పటికీ బాబర్ ఆజమ్ సంతోషంగా లేడని ఆరోపించింది. ప్రతి రోజు తనతో గొడవ పడేవాడని తెలిపింది. దీంతో అతడిపై పోలీసులకు హమీదా ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేక ఏళ్ల పాటు బాబర్ ఆజమ్ లైంగింకంగా వాడుకున్నాడని ఆరోపించింది. అతడి కారణంగా తాను గర్భవతిని అయ్యాయని.. అయితే బాబర్ ఒత్తిడి కారణంగా అబార్షన్ చేయించుకున్నానని తెలిపింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Babar Azam, Pakistan

  ఉత్తమ కథలు