ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand)పై పాకిస్తాన్ (Pakistan) విజయం (won) సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో మిగతా బ్యాట్స్‌మన్ విఫలమైనా అనుభవజ్ఞుడైన షోయబ్ మలిక్ (Shoaib Malik), అసిఫ్ అలీ (asif ali) కడదాకా నిలిచి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. 135 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించారు. ఛేదన ఆరంభంలో మహ్మద్ రిజ్వాన్ (33; 34 బంతుల్లో 5x4), ఆఖర్లో షోయబ్ మాలిక్ (27 నాటౌట్; 20 బంతుల్లో 2x4, 1x6), అసిఫ్ అలీ (27 నాటౌట్; 12 బంతుల్లో 1x4, 3x6) రాణించడంతో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు కివీస్‌లో కేన్ విలియమ్సన్ (25; 26 బంతుల్లో 2x4, 1x6), డేవాన్ కాన్వే (27; 24 బంతుల్లో 3x4), డరైల్ మిచెల్ (27; 20 బంతుల్లో 1x4, 2x6) ఫర్వాలేదనిపించారు.
లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అనుకున్నా..
కివీస్ కేవలం 135 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించడంతో పాక్ సునాయసంగానే విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ, కానీ, పిచ్ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో విలియమ్సన్ సేన ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. మైదానంలో ఫీల్డర్లు చురుగ్గా కదిలారు. 16 ఓవర్ల వరకు పాక్ జట్టు కష్టాలు పడింది. ఓపెనర్ రిజ్వాన్ ఒక్కడే నిలబడి పరుగులు చేశాడు. బాబర్ ఆజామ్ (9), మహ్మద్ హఫీజ్ (11), ఫకర్ జమాన్ (11), ఇమాద్ వసీమ్ (11) త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో 16 ఓవర్లకు పాక్ 98/5తో ఇబ్బందుల్లో పడింది. అయితే అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్ నిలబడటంతో పాక్ ఆశలు పెట్టుకుంది. మరో వైపు 17 ఓవర్లో అసిఫ్ అలీ రెండు సిక్సర్లు బాది ఒత్తిడి తగ్గించాడు. తర్వాతి ఓవర్లో షోయబ్ మాలిక్ సిక్సర్, ఫోర్ బాదేయడంతో సమీకరణం సులువైంది. ఆ తర్వాతి ఓవర్లో అలీ మరో సిక్సర్ దంచడంతో పాక్ వరుసగా రెండో విజయం అందుకుంది.
నెమ్మదిగా ప్రారంభించి..
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. కుదురుకుంటున్నక్రమంలో 36 పరుగుల వద్ద మార్టిన్ గప్టిల్ (17) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఏ దశలోనూ దూకుడు ప్రదర్శించలేకపోయింది. 54 పరుగుల వద్ద డరిల్ మిచెల్ (27), 56 పరుగుల వద్ద జేమ్స్ నీషమ్ (1) అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది.
Pakistan fans look on eagerly, hoping for their second win in the Super 12 stage ?@OPPOIndia | #Shotoftheday pic.twitter.com/bpwM4pGqCa
— ICC (@ICC) October 26, 2021
ఈ దశలో క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. కాన్వేతో కలిసి జట్టును చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి నిదానంగా (slow) ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. అయితే పాక్ బౌలర్ల ముందు వారి ఆటలు సాగలేదు. 25 పరుగులు చేసిన విలియమ్సన్ రనౌట్‌గా వెనుదిరగ్గా, 27 పరుగులు చేసిన కాన్వే.. హరీస్ రవూఫ్ బౌలింగు (bowling)లో పెవిలియన్ చేరాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు (runs) చేయలేదు. ఫలితంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 134 పరుగుల వద్ద ముగిసింది.
Pakistan and Afghanistan occupy the ? 2 spots ?
Will any team chase them down in Group 2❓#T20WorldCup pic.twitter.com/sODUFsgxBD
— ICC (@ICC) October 26, 2021
పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ (Rauf) నాలుగు వికెట్లు తీసుకోగా, షహీన్ అఫ్రిది (Shahin Afridi), ఇమాద్ వాసిమ్, హఫీజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.