పాకిస్థాన్‌లో ఆసియా కప్ 2020... వేదిక మార్చాల్సిందే అంటున్న భారత్...

ఆసియాకప్ 2020 పాకిస్థాన్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్... వేదిక మార్చకపోతే టోర్నీ నుంచి తప్పుకునే ఆలోచనలో టీమిండియా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 29, 2019, 7:26 PM IST
పాకిస్థాన్‌లో ఆసియా కప్ 2020... వేదిక మార్చాల్సిందే అంటున్న భారత్...
2018 ఆసియాకప్ విజేత భారత్ (AP Photo/Aijaz Rahi)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 29, 2019, 7:26 PM IST
పూల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదనే కామెంట్స్ పెరిగినా... ఎన్నో ఏళ్ల నుంచే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు నిరాకరించింది భారత జట్టు. ఈ విషయమై పాక్ క్రికెట్ బోర్డు, ఐసీసీని ఆశ్రయించడం... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ కూడా బీసీసీఐకి అనుకూలంగా తీర్పు వెలువరించడం జరిగిపోయాయి. ఇది అలా ఉంచితే... వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఆసియాకప్ 2020 పాకిస్థాన్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్టు సమాచారం. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకే ఇష్టపడని టీమిండియా... ఆసియా కప్ పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి వెళ్లేందుకు ఏ మాత్రం అంగీకరించదు. రెండేళ్లకోసారి ఆసియా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ... గత ఏడాది యూఏఈ వేదికగా జరిగింది. టీమిండియా, పాక్‌లో పర్యటించేందుకు ఒప్పుకోకపోతే... దాన్ని తిరిగి ఇలాంటి తటస్థ వేదిక పైనే నిర్వహించే అవకాశం ఉంది. ఐసీసీపై తనదైన శైలిలో ఆధిపత్యం చూపిస్తున్న బీసీసీఐ... ఈ విషయంలో పక్కాగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్... బీసీసీఐ మాట వినకుండా పాక్‌లోనే టోర్నీ నిర్వహించాలని భావిస్తే మాత్రం టోర్నీ నుంచే నిష్కమించాలనే ఆలోచనలో ఉంది భారత క్రికెట్ బోర్డు.

ఒకవేళ ఆసియా కప్‌లో భారత జట్టు ఆడకపోతే వీక్షకుల సంఖ్య భారీగా పడిపోతుంది. టీమిండియా లేకుండా జరిగే ఆసియాకప్ టోర్నీకి పెద్దగా ప్రేక్షకుల స్పందన ఉండకపోవచ్చు. దాంతో వేదిక మార్పు విషయమై మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగలేదు. పాక్ ఈ విషయమై భారత క్రికెట్ బోర్డును డిమాండ్ చేస్తూ, అభ్యర్థిస్తున్నప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఆసియాకప్ 2020తో పాటు 2022లో ఏషియన్ గేమ్స్ గురించి సింగపూర్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో చర్చించారు. గత ఏడాది ఆసియాకప్‌ను రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...