PAKISTAN ANNOUNCES THEIR15 MEMBER SQUAD FOR T20 WORLD CUP BUT SELECTORS GIVEN SHOCK TO SENIOR BATSMAN PRV
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్.. ఆ సీనియర్ బ్యాట్స్‌మన్‌కు షాకిచ్చిన సెలెక్టర్లు
పాక్ టీమ్ (ఫైల్)
పాకిస్తాన్ తమ ప్రపంచకప్ జట్టు (World cup Team)ను ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సోమవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ (Babar Azam) నాయకత్వం వహించనున్నాడు. అయితే అనూహ్యంగా అనుభవజ్ఞుడైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటు దక్కలేదు.
అక్టోబర్(October) 17న యూఏఈ(UAE) వేదికగా టీ20 వరల్డ్‌కప్( T20 world cup -2021) జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా జట్లు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఐసీసీ సూచన మేరకు ఇదివరకే ఆస్ట్రేలియా తమ తుది 15 మందితో కూడిన టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించింది. ఇపుడు పాకిస్తాన్ కూడా తమ ప్రపంచకప్ జట్టు (World cup Team)ను ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సోమవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ (Babar Azam) నాయకత్వం వహించనున్నాడు. అయితే అనూహ్యంగా అనుభవజ్ఞుడైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మలిక్ (Shoaib Malik)కు జట్టులో చోటు దక్కలేదు. సీనియర్ బ్యాట్స్‌మన్ అయిన షోయబ్ గత సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు(International matches) ఆడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, కెప్టెన్ బాబర్ షోయబ్ మలిక్ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. అయితే సెలెక్టర్లు (Selectors) మాత్రం అతని సూచనను పరిగణనలోకి తీసుకోకుండా జట్టును ఎంపిక చేశారు.
PSLలో సత్తాచాటినవారికి చోటు..
పాక్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ (Md Rizwan) వైఎస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇమాద్ వసీం, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది , మహ్మద్ హఫీజ్‌లకు జట్టులో చోటు దక్కింది. ఆసక్తికరంగా 15 మంది సభ్యుల జట్టులో బ్యాక్-అప్ ఓపెనర్ లేడు. అయితే ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను పీసీబీ ప్రకటించింది. అందులో ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) ఉన్నాడు. అబుదాబిలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో అదరగొట్టిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌కు సోహైబ్ మక్సూద్ (Sohaib Maqsood)కు జట్టులో చోటు కల్పించారు. మక్సూద్ ఈ సీజన్లో 126 మ్యాచ్‌ల్లో 156.78 స్ట్రైక్-రేట్‌తో 428 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్ల జాబితాలో మక్సూద్ మూడవ స్థానంలో నిలిచాడు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfraz Ahmed) కూడా గత ఏడాదిగా బెంచ్‌కే పరిమితం అవడంతో వేటుపడింది.
షహనావాజ్ ధాని, ఉస్మాన్ ఖాదిర్‌లను రిజర్వ్ ప్లేయర్(Reserve Players)లుగా ఎంపిక చేసింది పీసీబీ. ఆసిఫ్ అలీ, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, మొహమ్మద్ హస్నైన్, హారిస్ రౌఫ్, అజమ్ ఖాన్ టీ20 జట్టుకు ఎంపికైన ఇతర ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. అజమ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ తరఫున అజమ్(Azam) అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే సూపర్ 12కి అర్హత సాధించిన పాకిస్తాన్ జట్టు అక్టోబర్ 24న భారత్‌తో తలపడనుంది. టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్లోని గ్రూప్ 2లో భారత్, పాక్, న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్లతో పాటు మరో రెండు జట్లు ఉన్నాయి.
రిజర్వ్ ప్లేయర్లు: షానవాజ్ ధాని, ఉస్మాన్ ఖాదిర్, ఫఖర్ జమాన్
కాగా, వరల్డ్ కప్ అనంతరం స్వదేశంలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లోనూ ఇదే పాక్ జట్టు న్యూజిలాండ్, ఇంగ్లాండ్లతోనూ తలపడనుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.